వ్యక్తిగత భాగాలలోని దురదను నివారించేందుకు సులభమైన చిట్కాలు...

వ్యక్తిగత భాగాలలో దురద కలగడం కొంచెం ఇబ్బందికరమైన సందర్భం. ప్రత్యేకంగా, బహిరంగ స్థలాలలో ఈ సమస్య కలిగితే మరింత ఇబ్బందికి దారి తీస్తుంది. ఇది సహజమే అయినా దీనిని నివారించేందుకు ప్రయత్నించవచ్చు. పనిమీద బయటికి వెళ్ళినప్పుడు వ్యక్తిగత భాగాలలో దురద కలగడం చేత దురదను నియంత్రించలేకపోవటంతో ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. అసలు, ఈ దురదకి కారణాలేంటో తెలుసుకుందాం. జననేంద్రియ మొటిమలు, మెనోపాస్, ఇన్ఫెక్షన్, కెమికల్స్ తో పాటు కొన్ని చర్మ సంబంధిత సమస్యల వలన దురద కలుగుతుంది. వీటితో పాటు వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం కూడా వ్యక్తిగత భాగాలలో దురద కలగటానికి ప్రధాన కారణంగా భావించవచ్చు. సంభోగం తరువాత పాటించవలసిన కనీస పరిశుభ్రతా చర్యలు లేకపోవటం కూడా వ్యక్తిగత భాగాలలో దురదకు దారితీస్తుంది. ఈ సమస్య ఇలాగే కొనసాగితే సమస్య మరింత జఠిలంగా మారుతుంది.
తులసి ఆకులు: యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ మైక్రోబయాల్ ప్రాపర్టీలు పుష్కలంగా కలిగి ఉండటం చేత వ్యక్తిగత భాగాలలోని దురదను తరిమికొట్టే శక్తి తులసి ఆకులకు కలదు. కొన్ని తులసి ఆకులను కొంత నీటిలో 20 నిమిషాల పాటు మరగనివ్వండి. ఆ తరువాత చల్లార్చి, వడగట్టిన ఆ నీటిని సేవించండి.
కొబ్బరి నూనె: కొబ్బరి నూనెలో నున్న హైడ్రేటింగ్ ప్రాపర్టీస్ వలన చర్మానికి ఉపశమనం కలుగుతుంది. ప్రభావిత ప్రాంతంపై కొబ్బరినూనెను అప్లై చేయడం వలన దురద తగ్గుతుంది. వ్యక్తిగత భాగాలలో ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ ను తగ్గించే గుణం కొబ్బరి నూనెలో కలదు. ప్రతి రోజూ ప్రభావిత ప్రాంతంపై కొబ్బరి నూనెను అప్లై చేయాలి. ఆరు కప్పుల నీటిలో నాలుగు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను కలిపి ఈ మిశ్రమంతో మీ వ్యక్తిగత భాగాలను శుభ్రపరచుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది.
సముద్రపు ఉప్పు: వ్యక్తిగత భాగాలలో ఇన్ఫెక్షన్స్ ను నశింపచేసే అద్భుతమైన గుణం సముద్రపు ఉప్పులో కలదు. హానికర బాక్టీరియా మరియు ఫంగై యొక్క పెరుగుదలను అడ్డుకుని వ్యక్తిగత భాగాల వద్ద దురదను నివారిస్తుంది. 2 కప్పుల నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఉప్పును కలిపి ఈ మిశ్రమంతో మీ వ్యక్తిగత భాగాలను శుభ్రం చేసుకోండి. ప్రతి రోజూ ఈ రెమెడీని పాటిస్తే దురద సమస్య తగ్గుముఖం పడుతుంది.
వేపాకులు: వేప ఒక ఔషధ మొక్క. శతాబ్దాలుగా అనేక రకాలైన ఆరోగ్య సమస్యలకు వేప నుంచి అద్భుతమైన పరిష్కారాలు లభిస్తున్నాయి. వేపలో యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీలతో పాటు యాంటీ ఫంగల్ ప్రాపెర్టీలు కలవు. గుప్పెడు వేపాకులను స్నానపు నీటిలో వేసుకుని ఆ నీటితో స్నానం చేయండి. 4 కప్పుల నీటిలో కొన్ని వేపాకులను కలిపి పదినిమిషాల పాటు మరిగించాలి. చల్లార్చి, వడగట్టిన ఆ నీటితో మీ వ్యక్తిగత భాగాలను శుభ్రం చేసుకోవాలి.
పెరుగు: పెరుగులో మంచి బాక్టీరియా ఉంటుంది. అందుకే, వ్యక్తిగత భాగాలలో దురదను నివారించేందుకు సమర్థవంతమైన సహజసిద్ధ రెమెడీగా పెరుగును పేర్కొంటారు. తీపిలేని పెరుగుని ప్రతి రోజూ తీసుకున్నట్లైతే శరీరంలోని మంచి బాక్టీరియా స్థాయిలను పెంపొందిస్తుంది.
వెల్లుల్లి: వెల్లుల్లిలో యాంటీ బయాటిక్ మరియు యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీలు కలవు. ఇవి, వ్యక్తిగత భాగాలలో విపరీతమైన దురదని నివారించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. కొన్ని చుక్కల వెల్లుల్లి నూనెను తీసుకుని అందులో విటమిన్ ఈ నూనెను కలపండి. ఈ మిశ్రమాన్ని ప్రభావితమైన వ్యక్తిగత భాగాలపై అప్లై చేసి కాసేపటి తరువాత స్వచ్ఛమైన నీటితో శుభ్రపరచండి.

-నవీన్ నడిమింటి
Image:Wikihow

Comments

Popular Posts