మధుమేహం - తీసుకోవలసిన జాగ్రత్తలు

·  చక్కెరవ్యాధిగ్రస్తులు ఆ జబ్బు గురించి అవగాహన పెంచుకోవాలి. ఇతర రోగులతో కలిసి తమకు తెలిసిన విషయాలను మిగిలిన వారితో పంచుకోవాలి. పాదాలు, మూత్ర పిండాలు, గుండె, నరాలు మొదలైన అవయవాలపై ఈ వ్యాధి ప్రభావం ఎలా ఉంటుందో వీరు తెలుసుకోవాలి.
·  రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. తద్వారా శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి.
· భోజనానికి అరగంట ముందు మాత్రలు వేసుకోవాలి. మాత్రలు వేసుకోవడం మాత్రమే కాదు. వాటిని ప్రతిరోజూ సరియైన సమయంలోనే వేసుకోవాలి. సమయ పాలన లేకపోతే మందులు వేసుకుంటున్నా శరీరంలో ఒక అపసవ్య స్థితి ఏర్పడుతుంది.
·    ప్రతి రోజూ ఒక నిర్ణీత సమయంలోనే భోజనం చేయాలి.
·    ఇన్సులిన్‌ వేసుకోవడంలోనూ కాల నియమాన్ని పాటించాలి.
·   మధుమేహంలో కాళ్లల్లో స్పర్శజ్ఞానం పోయిందన్న విషయం చాలాకాలం వరకు తెలియదు. అందుకే వారు ఏటా ఒకసారి పాదాల్లో స్పర్శ ఎలా ఉందో తెలుసుకోవాలి. స్పర్శ లేకపోతే ప్రతి ఆరుమాసాలకు వీలైతే మూడు మాసాలకు ఒకసారి పరీక్ష చేయించాలి.
· పాదాల మీద చర్మం కందిపోవడం, గాయాలు, పుండ్లు, ఆనెలు ఏమైనా ఉన్నాయేమో గమనించాలి. డాక్టర్‌ సమక్షంలో అవసరమైన చికిత్స తీసుకోవాలి.
· గోళ్లు తీసే సమయంలో ఎక్కడా గాయం కాకుండా జాగ్రత్త వహించాలి. పాదాలను ప్రతి రోజూ గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి.
·  ఇన్‌ఫెక్షన్లతో కాళ్లకు చీము పడితే చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాలి. డాక్టర్‌ సలహాతో యాంటీబయాటిక్స్‌, అవసరమైతే ఇన్సులిన్‌ తీసుకోవాలి.
·  అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌ పరీక్షలు, అలాగే కళ్లు, కిడ్నీ పరీక్షలు కూడా డాక్టర్‌ సలహా మేరకు చేయించుకోవాలి.
·  మధుమేహం ఉన్న వారికి మూత్ర పిండాలు దెబ్బతినే అవకాశం ఉంది. దీనివల్ల మూత్రంలో ఆల్బుమిన్‌ అనే ప్రొటీన్‌ విసర్జించబడుతుంది. అంతిమంగా ఇది కిడ్నీ దెబ్బ తినడానికి దారి తీస్తుంది. అందుకే ప్రతి మూడు మాసాలకు, ఆరు మాసాలకు పరీక్ష చేసి మూత్రంలో ఆల్బుమిన్‌ ఉందా లేదా కనుగొనాలి.
· మధుమేహం ఉన్న వారిలో గుండె కండరాలకు రక్తాన్ని కొనిపోయే కరొనరీ రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఉంది. అందుకే గుండె నొప్పి ఉన్నా లేకపోయినా ప్రతి ఏటా ఇసిజి, ట్రెడ్‌మిల్‌ పరీక్షలు చేయించుకోవడం అవసరం. అలాగే కొలెస్ట్రాల్‌ పరిమాణాన్ని తెలిపే లిపిడ్‌ ప్రొఫైల్‌ పరీక్షలు చేయించాలి.
· ధాన్యాలు, పిండిపదార్థాలు తగ్గించి పీచు పదార్థాలు అధికంగా ఉండే కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
·  రక్తంలో త్వరగా కరిగిపోయే పీచుపదార్థాలను కలిగి సోడియం కొలెస్టృఆలు లేని జామపండు మధుమేహ వ్యాధిగ్రస్థులు తినతగిన పండ్లలో ఒకటి.మధుమేహాన్ని నియంత్రిస్థుందని ఆధునిక విజ్ఞానం వివరిస్తుంది.

Comments

Popular Posts