"ఈ అనుభూతిలో భాగం పంచుకోవాలంటే అదృష్టం ఉండాలంతే"!

దాదాపు 5 లక్షల మంది భక్తులు.. జోరుగా వాన.. ఎక్కడా ఉత్సాహం కోల్పోకుండా తిరుమల మాడ వీధుల్లో కళలు ప్రదర్శిస్తున్న దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుండి వచ్చిన కళా బృందాలు.. అసలు వర్షాన్ని లెక్క చెయ్యకుండా అన్ని లక్షల మంది గోవిందనామ జపం చేస్తుంటే.. అక్కడ ఉండే పాజిటివ్ వైబ్రేషన్స్ చూసి ఒళ్లు పులకించిపోయింది. I never experienced such a magical moments in the recent past. ఒక్క మాటలో చెప్పాలంటే.. "ఈ అనుభూతిలో భాగం పంచుకోవాలంటే అదృష్టం ఉండాలంతే"!
స్వామి వారి బ్రహ్మోత్సవాల సమయంలో.. ముఖ్యంగా గరుడవాహన సేవ రోజు తిరుమలలో వర్షం పడడం అనవాయితీ. ఎప్పుడు ఎక్కడ వర్షం పడుతుందో లెక్కేసి చెప్పే వాతావరణ శాస్త్రవేత్తలకు కూడా అంతుపట్టని పజిల్ అది. స్వామి గరుడ వాహనం మీద ఊరేగింపు మొదలవ్వడం.. చిన్న చిన్న చినుకులుగా మొదలైన వర్షం పెద్దదై దాదాపు గంటసేపు కురవడం.. భక్తులు అదేమీ పట్టించుకోకుండా చాలా హై-ఎనర్జీ లెవల్స్‌లో కళ్లెదుట జరుగుతున్న అద్భుతాలను చూడడం నేను స్వయంగా కళ్లారా చూశాను.
తిరుమల వెళ్లే భక్తులకి చాలామందికి తెలిసిన విషయమే.. కొండ మీద ఎలాంటి నొప్పులూ, బాధలూ, భయాలూ ఉండవు. సంవత్సరానికి ఐదారుసార్లు నేను మెట్ల దారిన వెళ్తాను.. అదీ కేవలం 41 నుండి 43 నిముషాల్లోపు! ఏరోజూ నాకు అలసట అన్పించేది కాదు. ఇదే విశేషం చాలామంది నాతో పంచుకున్నారు. వాస్తవానికి ఐదారు రోజుల క్రితం నాకు సడన్‌గా కోల్డ్ వచ్చింది. చెవిలో మిడిల్ ఇయర్‌లో మ్యూకస్ చేరితే బ్యాలెన్సింగ్ తప్పి తలంతా తిరిగిపోయినట్లు ఉంటుంది. పడుకున్నా అలాగే ఉంటుంది. సో ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో అలాంటిది ఫేస్ చేశా. సో తిరుపతి వెళ్లాలి కాబట్టి నాకు ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇష్టం లేకపోయినా ఏంటీబయాటిక్, ఏంటీ హిస్టమిన్ వేసుకున్నా. చాలా నీరసంగా ఉంటాయి ఆ రెండూ! తిరుమలలో మార్నింగ్, ఈవెనింగ్ ఆ రెండూ వేసుకున్నా అసలు డ్రౌజీగా గానీ, ఇంకెలాంటి ఇబ్బందులూ లేవు. అంతా నార్మల్ అయింది. కొండ మీద వర్షంలో తడిచినా అసలు అతి మామూలుగా ఉన్నాను. కొంతమంది దీన్ని పాజిటివిటీ వల్ల వచ్చిన ఫలితం అని కొట్టి పారేయొచ్చు.. తిరుమల గురించి తెలీని వాళ్లు మాత్రమే అలా అనగలుగుతారు.
సరే అసలు విషయానికి వస్తే.. రెండు నెలల క్రితం తిరుపతికి చెందిన కాంట్రాక్టర్ హరి గారు.. "ఈసారి బ్రహ్మోత్సవాలకు వెళదాం, ట్రెయిన్ టికెట్లు బుక్ చేసుకోండి" అని చెబితే.. "ఆ రష్‌లో నా వల్ల కాదు సర్.." అంటూ చాలామంది బ్రహ్మోత్సవాల గురించి వ్యక్తపరిచే అభిప్రాయాన్నే నేనూ చెప్పాను. "ఒక్కసారి మీరు వస్తే ఇలా అనరు" అంటూ ఆయన కన్విన్స్ చెయ్యడంతో సరే అని అదే రోజు ట్రెయిన్ టికెట్స్ చేసుకున్నాను. "మంచిగా దర్శనం అయ్యేలా చూడు స్వామీ" అంటూ స్వామిని కోరుకోవడం తప్పించి వేరే ఎలాంటి ప్రత్యేకమైన ఏర్పాట్లూ లేవు.
హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్లగానే మార్నింగ్ హరి గారు, భవాని గారు, మదనపల్లి నుండి మధుకర్ గారు, తిరుపతి నుండే రాజ్ గారు కలిశారు. కొండ మీదకి ఉదయం 11 గంటల సమయంలో వెళ్లాం. ఎక్కడోచోట ప్లేస్ చూసుకుని గ్యాలరీల్లో కూర్చుందాం అని తిరుగుతుంటే.. చేతిలో వాకీటాకీతో ఓ పోలీస్ యూనిఫార్మ్‌లో ఉన్న వ్యక్తి చూసి నవ్వుతున్నారు. నేనూ నవ్వగానే "శ్రీధర్ గారే కదా" అని పలకరించారు. ఆయన తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ పోలీస్ స్టేషన్‌లో C.Iగా చేస్తున్నారు. చాలా కాలంగా ఆయన నన్ను ఫాలో అవుతున్నారట. గుడి వెనుక పడమర మాడ వీధికి ఇన్‌ఛార్జ్‌గా ఆయన డ్యూటీ చేస్తున్నానని చెప్పారు. ఓ 2 నిముషాలు మాట్లాడాక అందరం ముందుకు వెళ్తుంటే.. భవాని గారు వెనక్కి వెళ్లి ఆయన్ని ఎక్కడైనా కంఫర్ట‌బుల్‌గా కూర్చోవడానికి కుదురుతుందా అని అడుగుతున్నారు. బాగోదని నేనూ వెళ్లాను. "మీరు ఫలానా చోట కూర్చోండి.. స్వామి ఊరేగింపు టైమ్‌లో నేను మిమ్మలను వాహనం దగ్గరకు తీసుకెళ్తాను" అంటూ ఆయన హామీ ఇచ్చారు. అలాగే భవాని గారికి తెలిసిన మరో కానిస్టేబుల్ కూడా అక్కడే ఉండడంతో.. కేవలం శ్రీవారి సేవకులు ఫుడ్ సప్లై చెయ్యడానికి ఉద్దేశించబడిన first rowలో కూర్చున్నాం. అక్కడకి జనరల్ పబ్లిక్‌ని అనుమతించరు. దాదాపు అన్ని కల్చరల్ ఏక్టివిటీస్‌ మా ఎదురుగానే జరిగాయి. స్వామి వారి ఊరేగింపు దగ్గరకు వచ్చేటప్పటికీ.. CI చంద్రశేఖర్ గారు నన్ను బయటకు తీసుకెళ్లి స్వామి వారి వాహనం దగ్గరకు తీసుకెళ్లారు. చాలా సంతృప్తిగా దర్శనం అయింది. మిగతా మిత్రులకు కూడా స్వామి ఊరేగింపు దగ్గరగా కన్పించింది.
అంతలో మరో అవకాశంగా.. ఇంకో హారతి పాయింట్‌లో ఇంకోసారి స్వామి వారి వాహనం దగ్గరకు వెళ్లి.. ఆ వాహనం క్రిందుగా ముందు భాగం నుండి వెనుక భాగానికి చేరుకునే (అది ఓ గొప్ప అవకాశం చాలామందికి) అదృష్టం దక్కింది. నాకు ఇదంతా చూశాక.. చాలా వండర్ అన్పించింది. ఎలాంటి ఏర్పాట్లూ లేకుండానే అప్పటికప్పుడు CI చంద్రశేఖర్ గారు నన్ను గుర్తుపట్టడం.. ఆ తర్వాత అన్నీ చాలా బాగా జరగడం మిరాకిల్. వాస్తవానికి మేము ఆయన ఉన్న వైపు వెళ్లే అవకాశం కూడా లేదు. ఓ నాలుగైదు డైరెక్షన్లు కాదనుకుని.. అటు వెళదాం అని అటువైపు వెళ్లాం. లేదంటే ఆయన కన్పించే వారు కూడా కాదు. స్వామి గురించి, స్వామి లీలల గురించి ఎంత రాసినా తక్కువే.
లైఫ్‌లో ఒక్కసారైనా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు, అదీ గరుడ వాహన సేవని స్వయంగా చూడండి.. అంత మ్యాజికల్ మూమెంట్స్ ఇంకెక్కడా రావు.
Author:Nallamothu Sridhar (Tech Guru & Editor : Computer Era) 

Comments

Popular Posts