శ్రీరామ రామ రామేతి.....ఈ శ్లోకం మూడు సార్లు పఠించితే విష్ణు సహస్రనామం చదివినంత పుణ్యం!!


శ్రీరామ రామ రామేతి
రమే రామే మనోరమే;
సహస్ర నామ తతుల్యం,
రామ నామ వరాననే.
( శ్లోకం మూడు సార్లు పఠించితే విష్ణు సహస్రనామం చదివినంత పుణ్యం)

శ్రీరామ రామ రామ అని మూడుసార్లు రామ నామాన్ని జపిస్తే విష్ణు సహస్ర నామాన్ని జపించినంత పుణ్యఫలం లభిస్తుందని సాక్షాత్తు మహాశివుడు పార్వతిమాతతో చెప్పాడు. రామనామ విశిష్టత అమోఘమైనది. అద్వితీయమైనది. ఇహలోకాన్నుండే బాధలను తొలగించి, పర లోకాన ముక్తిని, మోక్షాన్ని ప్రసాదించేది. నామాన్ని సదా స్మరణం చేసే వారి ఇంట్లో లేమి ఉండదని, వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఐశ్వర్యంతో తులతూగుతారని పురాణాలు చెబుతున్నాయి. కబీర్దాస్, తులసీదాస్, భక్తరామదాసు లాంటి మహా భక్తులెందరో రామనామమే పరమావధిగా భావించి, పునీతులయ్యారు. రామనామ విశిష్టత అనన్య సామాన్యమైనది.‘రామనామ మందు మంత్రాత్మకమైన నిగూఢార్ధం ఇమిడి ఉంది. ఇందులోకారము రుద్రుని, ‘కారము బ్రహ్మను, ‘కారము విష్ణువుని సూచిస్తుంది. కనుకనేరామశబ్దం బ్రహ్మవిష్ణు, శివాత్మక రూపంగా భావించడం జరుగుతోంది. అలాగేరామఅనే శబ్దం జీవిత్మ పరమాత్మలకు స్వరూపంగా కూడా చెప్పడం జరుగుతోంది. ఇందులోరాఅనే అక్షరాన్నితత్అని అనగాపరబ్రహ్మముఅనిఅనే అక్షరానికిత్వంఅనగా జీవాత్మ అని అర్థం చెబుతారు. అలాగే అష్టాక్షరి మహామంత్రమయిన ఓం నమో నారాయణాయ నమఃలోరాబీజాక్షరం, పంచాక్షరి మహామంత్రమయిన ఓం నమఃశివాయలోబీజాక్షరం ఇందులో ఇమిడి ఉన్నాయి. అందువల్లే ఇది రెండు మంత్రాల శక్తిని, మహత్తును కల్గి ఉందని పురాణాలు చెబుతున్నాయి. అత్యంత శక్తిదాయకమైన రామ మంత్ర జపంవల్ల ముక్తిమోక్షాలు లభిస్తాయి. కనుకనే హరిహరాత్మకమైన రామనామ మంత్ర రాజాన్ని తారకమంత్రంగా చెప్పడం జరుగుతోంది.

Comments

Popular Posts