ఆయుర్వేదంలో మధుమేహం గురించి ప్రస్తావన

వేదకాలంలో మధుమేహ ప్రస్తావన ఉంది.ఆ కాలంలో మధుమేహాన్ని అశ్రవ అనే పేరుతో గుర్తించారు.ఈ వ్యాధి ఎలా వస్తుంది వ్యాధి లక్షణాలు ఏమిటి అని చరక సంహిత , శుశ్రవసంహిత మరియు నాగబట్ట గ్రంధాలలో వర్ణించబడింది.క్రీస్తుశకానికి వెయ్యి సంవత్సరాల క్రిందట ఈ వ్యాధి వర్ణన ఉంది. యజ్ఞాలలో సమయాలలో దేవతలకు సమర్పించబడే హవిస్సును భుజించడం వలన ఈవ్యాధి వచ్చినట్లు వర్ణించబడింది.దక్షప్రజాపతి చేసిన యజ్ఞంలో హవిస్సు భుజించడం వలన ఈ వ్యాధి వచ్చినట్లు ప్రస్తావన ఉంది.క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలో అష్టాంగ హృదయ అనే గ్రంధంలో మధుమేహం అనే పదం వాడబడింది. తేనెను మధువు అని అంటారు కనుక ఈ వ్యాధిగ్రస్థుల మూత్రం తేనెరంగు ఉంటుందని దీనికి ఈ పేరు వచ్చిందని భావన.1400 సంవత్సరాల క్రితమే ఈ వ్యాధికి పథ్యం, ఔషధం మరియు వ్యాయామంతో క్రమపరచవచ్చని పేర్కొన్నారు.దాదాపు ఇప్పటికీ అనుసరిస్తున్న విధానం అదే కావడం గమనార్హం.

ఆయుర్వేదంలో గుర్తించిన వ్యాధి కారక అలవాట్లు:
·   అతిగా పాలు త్రాగడం, పాల ఉత్పత్తులు భుజించడం.
·   అతిగా చక్కెర ఉపయోగించడం, చక్కెర రసాలు త్రాగడం.
·   క్రొత్తగా పండిన ధాన్యాలను వంటలలో వాడడం.
·   తాజాగా చేసిన ఆల్కహాల్ సేవించడం.
·   అతిగా నిద్ర పోవడం మరియు శరీరశ్రమ కావలసినంత చేయకపోవడం.
·   మానసిక ఆందోళన, భారీ కాయం మరియు అహారపు అలవాట్లు.
·   ముందుగా తిన్నది జీర్ణంకాకముందే తిరిగి భుజించడం.ఆకలి లేకున్నా ఆహారం తీసుకోవడం.అతిగా ఆహారం తీసుకోవడం.

మానుకోవలసిన అలవాట్లు
·  తీపి పదార్థాలు, ఐస్‌క్రీములు మానుకోవాలి. అతి పరిమితంగా తీసుకున్నప్పుడు అయితే, ఆరోజు మామూలుగా తీసుకునే ఆహార పదార్థాల మోతాదును బాగా తగ్గించాలి. అలాగే నూనె పదార్థాలు కూడా బాగా తగ్గించాలి.
· కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో శరీరంలో చక్కెర శాతం హఠాత్తుగా పెరిగిపోవచ్చు. అప్పుడు మాత్రలు ఆ స్థితిని అదుపు చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు డాక్టర్‌ సూచిస్తే ఇన్సులిన్‌ తీసుకోవాలి. ఆ తరువాత చక్కెర అదుపులోకి వచ్చాక మళ్లీ మాత్రలకే పరిమితం కావచ్చు. ఒకసారి ఇన్సులిన్‌ తీసుకుంటే జీవితాంతం ఇన్సులిన్‌ తీసుకోవలసి వస్తుందన్నది సరికాదు. ఆ కారణంగా ఇన్సులిన్‌ తీసుకోవడానికి వెనుకాడకూడదు.
·   పాదరక్షలు లేకుండా నడవకూడదు.
·   పొగతాగడం పూర్తిగా మానుకోవాలి.
·   మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవాలి.
·   కొలెస్ట్రాల్‌ అధికంగా ఉండే కొవ్వు ఉన్న మాంసం, గుడ్లు తినడం మానుకోవాలి.

Comments

Popular Posts