సీట్ బెల్ట్ గురించి క్లుప్తంగా........

సీట్ బెల్ట్ తప్పనిసరి. ఆ కొంచం దూరమేగా అని అనుకునే ప్రతీసారీ గుర్తు పెట్టుకోండి. సీట్ బెల్టు పెట్టుకోకుండా కారు లో కూర్చున్న ప్రతీసారీ, అదే ఆఖరు సారి కావొచ్చు. నిర్లక్ష్యం తగదు.
1. సీట్ బెల్ట్ ముఖ్యంగా 45 శాతం వరకూ స్టీరింగ్ ను ఛాతీకి దెబ్బ తగలనీయదు. చాతీకి దెబ్బ తగులితే, విరిగిన ఎముక (Ribs) కత్తి లా లంగ్స్ ని గాయం చేసి, పంక్చర్ పడిన బెలూన్ లా తరువాత ఎంత గాలి కొట్టిన పనికిరాదు. మరణం అనివార్యం.
2. సీటు బెల్టు వలన 75 సాతం వరకూ కారు నుండి బయటకి పడిపోకుండా కాపాడుతుంది. తద్వారా తలకు, పొట్టకు, ఛాతీకి తీవ్ర గాయాలు కానివ్వదు. బ్రతకడానికి దాదాపు ఆస్కారం ఉంటుంది.
3. సీటు బెల్టు తుంటి ఎముకను అదిమిపెట్టి పట్టుకుంటుంది. కారు పల్టీ కొట్టినా, మన తల కారు సీలింగ్ తగిలి స్పైన్ విరిగిపోకుండా కాపాడుతుంది. ఇది దాదాపు 80 శాతం ఆస్కారం ఉంది.
4. సీటు బెల్టు పెట్టుకుంటేనే కొన్ని ఎయిర్ బేగ్స్ పనిచేస్తాయి (దీనిపై వాదనలు జరుగుతున్నాయి. నిజాలు తేలాల్సి ఉన్నాయి)
5. అయితే సీటు బెల్టు వలన చిన్న చిన్న నష్టాలు ఉన్నా (సీట్ బెల్ట్ సిండ్రోం, సీట్ బెల్ట్ ఫైబర్ ఇంజురీ) ఇవి ప్రాణాంతకం కాదు.
కారు అతివేగం అనేక ప్రమాదాలకు కారణం అయినా, హైవే లో (ఇండియా రోడ్స్- 4/6 ట్రాక్స్) 80 KMPH దాదాపు అనుమతి ఉంటుంది. వీటితో పాటు సైన్స్ ఫాలో అయితే ప్రమాదం మరింత తగ్గొచ్చు.
-Mr. Murthy Kanakala

Comments

Popular Posts