తల్లీ! నేను చెప్పేది జాగ్రత్తగా విను!


ఆ తండ్రికి తన కూతురంటే చాలా ఇష్టం.. ఆ కూతురుకి కూడా తన తండ్రి అంటే అంతే ప్రేమ..
ఇంటర్ అయిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేసి హాస్టల్ లో దిగబెట్టాడు.. తిరిగి వెళ్తున్న వాడల్లా ఆగి కూతుర్ని దగ్గరకి పిలిచి ముద్దు పెట్టుకున్నాడు.. ఎప్పుడూ విడిచి ఉండలేదు మరి..
"నీతో రెండు నిమిషాలు మాట్లాడాలమ్మా" అన్నాడు..
"చెప్పు డాడీ" అంది కూతురు..
తండ్రి గొంతు సవరించుకుని ఇలా చెప్పాడు..
"చూడమ్మా - నాకు కులమత భేదాలు లేవు.. నీ చదువు అయిపోయిన తర్వాత నీకు నచ్చిన వాడితోనే నీ పెళ్ళి జరుగుతుంది.. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నువ్వు ఏనాడూ మమ్మల్ని విడిచి ఉండలేదు.. ఇప్పుడు హాస్టల్ లో ఉండబోతున్నావ్.. కొన్ని నిర్ణయాలు నీ సొంతంగా తీసుకోవాల్సి ఉంటుంది.. నేను కేవలం గైడెన్స్ మాత్రమే ఇవ్వగలను.. అందుకని ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను!
ఈ వయసులో యువతీయువకుల మధ్య ఆకర్షణ కలగడం సహజం.. కానీ నీ చదువు పూర్తయ్యి నీ కాళ్ల మీద నువ్వు నిలబడేంతవరకూ ఏ అబ్బాయినీ ప్రేమిస్తున్నాననీ కమిట్ అవ్వకు.. అలా కమిట్ అవడం వల్ల నువ్వు వేరే ఇంకొక అబ్బాయితో ఏం మాట్లాడినా ఇతనికి నువ్వు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిఉంటుంది.. అదో పెద్ద తలనొప్పి అవుతుంది నీకు..
పోనీ మంచివాడేనని ఒప్పుకున్నా, తర్వాత ఏ మగాడైనా ఆశించేది నీ శరీరాన్నే.. నా మీద నమ్మకం లేదా అదీ ఇదీ అని నిన్ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు.. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవద్దు.. ప్రేమించిన వాడైతే పెళ్లి వరకూ ఆగుతాడు..
పోనీ నీక్కూడా ఇష్టమైందనుకో మేం చేసేది ఏం లేదు.. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రెగ్నెన్సీ తెచ్చుకోకు.. దానివల్ల అతడికేమీ ఇబ్బంది ఉండదు.. దొంగచాటుగా చేసే అబార్షన్స్ వల్ల ప్రాణానికే ప్రమాదం వస్తుంది పైగా భవిష్యత్తులో నీకు అసలు పిల్లలే పుట్టకపోవచ్చు..
అన్యదా భావించకు.. జాగ్రత్తగా చదువుకో బై తల్లీ.. "
కూతురు తొందరపాటు పనులు చేయకుండా చదువు మీదే దృష్టి పెడుతుందని ఆ తండ్రికి తెలుసు.. నిశ్చింతగా వెళ్లిపోయాడు!

-Subbarao Kalavakuntla

Comments

Popular Posts