ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం(Organic Farming) మరియు పాలేకర్ వ్యవసాయపద్ధతులు -అవగాహన

సేంద్రీయ వ్యవసాయం (Organic Farming) అనగా ఎటువంటి రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకుండా కేవలం ప్రకృతి సిద్ధమైన ఎరువులు, వేప పిండి వంటి పదార్ధాలు వాడి పంటలు పండించడం. సేంద్రీయ వ్యవసాయము రెండు పద్ధతులు ఉంది.

1.ప్రకృతి వ్యవసాయం: ఈ పద్ధతిలో కేవలం ప్రకృతి సిద్ధమైన ఎరువులు, అనగా ఎండిన ఆవు/గేదె పేడ, ఆకు తుక్కు, వర్మీ కంపోస్టు (వానపాముల విసర్జన), వేప పిండి వంటి పదార్ధాలు వాడి పంటలు పండించడం జరుగుతుంది. ఇది సాధారణ పద్ధతి. ఈ పద్ధతి కేరళ మరియూ ఈశాన్య రాష్ట్రాల్లో కొనసాగుతున్నది. సేంద్రీయ వ్యవసాయంలో సిక్కిం ముందు స్థానంలో ఉంది.

2.రెండవ పద్ధతిని గో-ఆధారిత పద్ధతి లేదా సుభాష్ పాలేకర్ పద్ధతి అని అంటారు. ఈ పద్ధతిలో సేంద్రీయ వ్యవసాయం జీవామృతం అను సహజ రసాయనంతో సాగుతుంది. ఇక కీటక నాశానులుగా నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్ని అస్త్రం అను సహజ రసాయనాలు వాడబడతాయి.

ప్రకృతి వ్యవసాయం:
ప్రకృతి వ్యవసాయం అనేది జపనీస్ రైతు మరియు తత్వవేత్త అయిన "మసనోబు ఫుకుఒక" (1913–2008) ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన పర్యావరణ వ్యవసాయ విధానం. ఈ విధానాన్ని ఆయన 1975 లో "గడ్డి పరకతో విప్లవం"(The One-Straw Revolution: An Introduction to naturAl farming) అనే తన పుస్తకం లో పరిచయం చేసారు. ఫుకుఒక తన వ్యవసాయ విధానాన్ని జపనీస్ లో "షిజెన్ నోహో"గా అభివర్ణించారు. ఈ పద్ధతి "ఫుకుఒక పద్ధతి" లేక "సహజ వ్యవసాయ విధానం" గా కూడా పిలవబడుతుంది.

                                మసనోబు ఫుకుఒక- ప్రకృతి వ్యవసాయ పద్ధతి మూలకర్త.

ప్రకృతి వ్యవసాయంలోని పంచ సూత్రాలు:
దుక్కి దున్నకుండా,
ఎరువులు వాడకుండా,
పురుగుమందులు లేక కలుపు మందులు వాడకుండా,
కలుపు తీయకుండా,
కత్తిరింపు లేకుండా వ్యవసాయం చేయడం.

సారవంతమైన వ్యవసాయం:
1951 లో న్యూమాన్ టర్నర్ అనే అతను సారవంతమైన వ్యవసాయ పద్ధతిని సమర్దించారు. టర్నర్ వాణిజ్య రైతు అయినప్పటికీ సారవంతమైన వ్యవసాయ పద్ధతి లో ఆయన పాటించినా సూత్రాలు ఫుకుఒక పద్ధతి లోని సూత్రాలకు చాలా సారూప్యత ఉన్నది. ఇంతేకాక టర్నర్ పశుపాలన లో కూడా ప్రకృతి పద్ధతిని పాటించారు.

సేంద్రీయ వ్యవసాయం(Organic Farming):
ఈ ప్రాకృతిక వ్యవసాయం లో ప్రకృతిని మరియు ప్రకృతి వనరులని పాడుచేయకుండా వ్యవసాయం చేయబడుతుంది. ఇది ప్రాంతీయ వాతావరణాన్ని, వాటి పునరుత్పాదక వనరులని అనుసరించి చేసే పద్ధతి.

భారతదేశంలో ఆచరించబడుతున్న ప్రకృతి వ్యవసాయంలో వివిధ పద్ధతులున్నాయి.
అవి-
1.మసనోబు ఫుకుఓకా (Masanobu Fukuoka / జపాన్),
2.హ్యాన్ క్యుచో (కొరియా పద్ధతి),
3.పాలేకర్ పద్ధతి. 
భారతదేశంలో పద్మశ్రీ  సుభాష్ పాలేకర్ ప్రతిపాదించిన పాలేకర్ పద్ధతి ముఖ్యమైనది. ఈ వ్యవసాయం రసాయన వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చును.

    పద్మశ్రీ  సుభాష్ పాలేకర్

    Source:WikipediaComments

Popular Posts