ఒంటి చేత్తో మూడు వందల మందిని చంపడం ఎక్కడైనా చూసారా? బాహుబలి సినిమాలో కాదు... నిజంగా జరిగిన సంఘటన!!

ఒంటి చేత్తో మూడు వందల మందిని చంపడం ఎక్కడైనా చూసారా? సినిమాలలో చూసే ఉంటాము కదా. సరిగ్గా అలాంటిదే నిజంగా మన భారత దేశములో 1962 లో ఇండో చైనా యుద్ధములో జరిగింది. ఆతని వయస్సు ఇరవై ఒకటి. ఇంకా ముక్కు పచ్చలారకుండానే సైన్యములో చేరాడు.ఈశాన్య భారతములో యుద్ధము ఘోరంగా జరుగుతోంది. మన సైనికులకు తగు సదుపాయాలు లేవు, మందు గుండు సామగ్రి లేదు.. పైగా ప్రభుత్వ వెన్నుదన్నూ లేదు. కమాండర్ లకు ఎటువంటి దిశా నిర్ధేశమూ లేదు. యుద్ధములో మందీ మార్బలమూ లేక చాలా సైనిక బలగాలను వెనక్కి రప్పిస్తున్నారు

ఆ యుద్ధ సమయములో అరుణాచల ప్రదేశ్ నౌరారంగ్ వద్ద యుద్ధములో పాల్గొన్న జస్వంత్ సింగ్ రావత్ బెటాలియం యుధ్దము చేస్తూ ముందుకు సాగుతోంది . తగు సహాయము , యుద్ధ పరికరాలు అవేమీ లేక సైనికులను వెనక్కి వచ్చేయమని పిలుపు. కానీ జస్వంత్ సింగ్ మనస్సు వెనక్కి రావడానికి సుతరామూ ఒప్పుకోలేదు. తనకు అందుబాటులో ఉన్న మూడు రోజులకు సరిపడ యుద్ధ పరికరాలను మిగతా వారి నుండి సేకరించుకుని అక్కడే ఉండిపోయాడు. అక్కడ నివసించే ఇద్దరు అరుణాచల్ ప్రదేశ్ అమ్మాయిలకు దేశ భక్తి రంగరించి వారి సహాయముతో యుద్ధము చేయనారంభించాడు. ఆ అమ్మాయిలపేర్లు-సెల, నూరా . 

వీరు ముగ్గురూ యుధ్ధానికి మూడు ప్రదేశాలను ఎంచుకుని శత్రువులకు చిక్కకుండా కాల్పులు సాగిస్తూ శత్రు సైన్యాన్ని మట్టుబెడుతున్నారు. నూరా, సెలా శత్రువుల అలికిడి గమనించుతూ జస్వంత్ సింగ్ రావత్ ని అలర్ట్ చేసేవారు. దాదాపు మూడు వందల మందిని ఒంటి చేత్టో మట్టుబెట్టాడు జస్వంత్ సింగ్ రావత్ .చైనా సైన్యం అక్కడ చాలా మంది భారతసైనికులే ఉన్నారని ఎంతమంది ఏవిటి అనే నిర్ణయానికి రాలేక ఎదురు కాల్పులు సాగిస్తున్నా ఈ వైపు చనిపోతున్నారు కానీ అక్కడ హాహాకారాలు వినబడ్డం లేదు. చివరకు శత్రువులకు గుట్టు తెలిసింది . జస్వంత్ సింగ్ చుట్టు చైనా సైనికులు చుట్టు ముట్టారు. తనకు తెలుసు వారు ఇంక తనను బందీగా పట్టుకుంటారని . అదే సమయములో వెంటనే తనను తాను కాల్చుకుని చనిపోయాడు ఆ అమర వీరుడు జస్వంత్ సింగ్. సెలా శత్రువులు విసిరిన గ్రనేడ్ దాడిలో చనిపోయింది . నూరా ని సజీవంగా యుద్ధ ఖైదీగా బందించారు. జస్వంత్ సింగ్ మాత్రం తనను తాను కాల్చుకుని అమర స్వర్గం అలంకరించాడు. జస్వంత్ సింగ్ రావత్ స్థైర్య ధైర్య సాహసాలను చైనా సైనికులు సైతం మెచ్చుకునారు, ఆతను చనిపోయాక ఆతని తల నరకి తీసుకుపోయారు. యుద్ధం ముగిసి ఒప్పందం అయ్యాక ఆతని తలను తిరిగి అప్పగించారు ఆ చైనీయులు. ఆతని ధైర్య సాహసాలకు మహా వీర చక్ర అవార్డుని భారత ప్రభుత్వం మరణానంతరం ప్రకటించింది. ఆతని వస్తువులను ఆతని స్వగ్రామం ప్రజలు ఇప్పటికీ ఆతను బ్రతికి ఉన్నట్టే తలస్తూ పూజిస్తున్నారు.

Comments

Popular Posts