ఫ్రిజ్ లో కూరగాయలు, పండ్లు నిల్వ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు....


  • మార్కెట్ నుంచి కూరగాయలు, పళ్ళు తెచ్చిన వెంటనే అన్నీ కలిపి ఫ్రిజ్‌‌లో ఒకే చోట భద్రపరచకూడదు. వేటికవి విడదీసి, విడివిడిగా, రంధ్రాలున్న కవర్లలో పెట్టుకోవాలి. దీనివల్ల గాలి బాగా సోకి అవి ఎక్కువ సమయం తాజాగా కూడా ఉంటాయి. 
  • ఉల్లిపాయలు, టమోటో, వెల్లుల్లి, అరటిపళ్ళు మొదలైనవి ఫ్రిజ్‌లో పెట్టకూడదు.
  • బంగాళదుంపలు, మష్రూమ్స్ మొదలైనటువంటి వాటిని కూరలు చేసేందుకు ఉపయోగించే వరకు కడగకూడదు. అప్పుడే అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.
  •  ఉల్లి వెల్లుల్లి, మొదలైనవి ఫ్రిజ్‌లో కన్నా బయటే గాలి, వెలుతురు ధారళంగా వచ్చే ప్రాంతంలో ఉంచితేనే ఎక్కువ కాలం తాజగా ఉంటాయి.
  • ఆకు కూరలు తెచ్చిన వెంటనే వాటికున్న బ్యాండ్లు, తాళ్ళు తీసేయాలి. తర్వాత చల్లని నీటితో వాటిని కడిగి పాడైపోయినవి, కుళ్లిన వంటివాటిని తీసేయాలి. వేటికవి విడదీసి విడివిడిగా కవర్లలో పెట్టి భద్రపరచుకోవాలి.ఫ్రిజ్‌లో భద్రపరిచే ఆకుకూరలు కాస్త వాడిపోయినట్లుగా కనిపిస్తాయి. అలా కాకుండా ఉండాలంటే, ఆకుకూరల కాడలను ట్రిమ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసిన చివర్లను ఒక చిన్న పాత్రలో నీటిలో ఉంచుతూ పైభాగాన్ని కవర్‌తో కప్పి ఉంచాలి. ఇలా చేయడం వల్ల అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. 
  • టమోటోలు బయట ఉన్నా కూడా గది ఉష్ణోగ్రత వద్ద బాగానే నిల్వఉంటాయి. వాసన, రుచి సహజంగా నిలిచి ఉంటాయి. ఫ్రిజ్‌లో ఉన్న టమోటలైతే కాస్త రుచి తగ్గుతాయనే చెప్పవచ్చు.
  •  ఫ్రిజ్‌లో మాంసాహారాన్ని కూడా భద్రపరచాల్సి వస్తే ముందు రక్తం లేకుండా బాగా శుభ్రంగా చేసుకోవాలి. తర్వాత ఒక కవర్ లేదా మూత ఉన్న పాత్రలో పెట్టుకొని నిల్వ చేసుకోవాలి. లేదంటే ఆ వాసన ఫ్రిజ్ మొత్తం వ్యాప్తించే అవకాశం ఉంటుంది. అలాగే శుభ్రంగా లేని మాంసం ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల మిగిలిన ఆహార పదార్థాలు కూడా తొందరగా చెడిపోయే ప్రమాదం ఉంటుంది.
  • కూరగాయలు, పండ్లను ఫ్రిజ్‌లో ఒకచోటే ఉంచడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే, బాగా పండిన పళ్ళ నుంచి ఇథిలీన్ అనే గ్యాస్ వెలువడుతుంది. అది కూరగాయల మీద కూడా ప్రభావం చూపించి తొందరగా పాడయ్యేలా చేస్తుంది. అందుకే వేటికవి విడిగా భద్రపరచాలి.

Comments

Popular Posts