లక్షలు సంపాదిస్తున్నా... జీవితంలో "ఏదో" మిస్సింగ్.....

🦋వాళ్లంతా స్నేహితులు.
చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారు.
పెరిగి పెద్దవారయ్యారు.మంచి ఉద్యోగాన్ని సంపాదించారు.వేలల్లో జీతం...!
కానీ జీవితంలో ఏదో మిస్‌ అయ్యారు!
ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా అందరూ ఓచోట కలిసారు.
ఇదే విషయం గురించి చర్చించారు...కానీ ఏదో మిస్‌ అవుతున్నామని అందరూ ఒప్పుకున్నారు.....!
మాటల్లో మాటగా ఎవరో చిన్నప్పుడు వాళ్లకు పాఠం చెప్పిన ఓ మాస్టారూని గుర్తుచేశారు.
ఆ మాస్టారి పేరు గుర్తుకు రాగానే అందరి మోహాల్లో ఒక సంతోషం...!
ఎప్పుడూ సంతోషంగా ఉండే ఆ మాస్టారూ అంటే అందరికీ ఎంతో ఇష్టం....Inspiration...!
అంతా ఒక అండస్టాండింగ్‌కు వచ్చారు...వాళ్లు జీవితంలో మిస్‌ అయ్యిందేదో...ఆ మాస్టారూ ఎప్పుడూ అంత ఆనందంగా ఎలా ఉండేవాడో కనుక్కుందామని ఆయన దగ్గరకు బయలు దేరారు....!
ఆ మాస్టారూ దగ్గరకు వెళ్ళి, తామిప్పుడు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నారో అందరూ గొప్పగా చెప్పుకున్నారు..!
ఆయన చెప్పిన పాఠాల మూలంగే ఇంత గొప్పవాళ్లమయ్యామని గుర్తుచేశారు...!
తమతో ఆ గురువు ఎంత చనువుగా, స్నేహంగా ఉండేవాడో ఓసారి తవ్విపోశారు...
పనిలోపనిగా ఇప్పుడు జీవితంలో ఎదుర్కొంటున్న సాధకబాధలు...సవాళ్లను కూడా ఏకరువూ పెట్టారు.
ఎంతెంతో పెద్ద పెద్ద హోదాలో వున్నా...వేలకు వేల జీతాలు సంపాదిస్తున్నా ఏదో అశాంతికి గురవుతున్నామని చెప్పుకున్నారు.....!
ఇదంతా విన్న ఆ గురువు కాసేపు కూర్చోండని చెప్పి లోపలికెళ్ళాడు.
వాళ్లకోసం వేడి వేడి కాఫీని ఓ కేటిల్‌లో...ఓ ప్లేట్‌లో రకరకాల కప్పులను (పింగాణి, స్టీల్‌, మట్టి, రకరకా పూతో ఆకర్షణీయంగా డిజైన్‌ చేసినవి) తీసుకొచ్చి, అందరూ ముందు కాఫీ తాగండి అంటూ ఆఫర్‌ చేసాడు...!
వాళ్లంతా మోహమాట పడుతూనే....‘ఈ ఫార్మాలిటీస్‌ ఎందుకు మాస్టారూ’ అంటూ తలా ఒకరు, తమకు నచ్చిన కప్పును తీసుకొని తాగడం మొదలెట్టారు...!
వాళ్లంతా కాఫీ తాగడం అయిపోగానే ఆ మాస్టారూ వాళ్లందరిని ఉద్దేషించి..
‘‘మీరంతా గమనించారా...నేను కాఫీ ఆఫర్‌ చేయగానే, ఏ కప్పు తీసుకోవాలని కాసేపు అలోచించి మీరంతా మీకు నచ్చిన కప్పును ఎన్నుకుని కాఫీ తాగారు.. ఫలితం... ఇక్కడున్న వాటిలో నాసిరకం కప్పులే మిగిలిపోయాయి....!
అందరూ తాగే కాఫీ ఒకటే అయినా...తాగుతూ..ఇతరుల కాఫీ కప్పు, దాని డిజైన్‌ తమ కప్పు కంటే ఎంత బాగున్నాయే అని మధన పడుతూ తాగుతున్నారు. ... ఫలితం...తాగే "కాఫీని అస్వాధించడం" మరిచిపోయారు..అదే సకల సమస్యలకు మూలం....నేను, మీరు ఎంతమంది ఉన్నారో అన్ని కప్పు మాత్రమే తీసుకురావచ్చు..కానీ మీరు అడిగే ప్రశ్నకు మీ ద్వారానే సమాధానం చెప్పేందుకే కొన్ని ఎక్కువ కప్పు తీసుకొచ్చాను....!
ఈ ప్రపంచంలో మనకు ఆకర్షణీయంగా చాలా కనిపిస్తుంటాయి...వాటివెంట పరిగెడితే ఇక అంతే...! మీరంతా అదే పొరపాటు చేస్తున్నారు...!
ఇప్పుడు మీ కళ్లముందు జరిగిన ఈ ఉపమానాన్ని మీ జీవితానికి అన్వయించుకోండి...మీకే సమాధానం దొరుకుతుంది..!
ఎదుటి వాళ్లు ఎంత సంపాధిస్తున్నారో, ఎంత రిచ్‌గా ఉన్నారో...ఏ హోదాలో ఉన్నారో, ఏం కొంటున్నారో అని పొల్చుకొని...మధన పడుతూ...వాళ్లలా ఉండటానికి ప్రయత్నిస్తూ మీ ఇష్టాఇష్టాలను, మీ అభిరుచులను అన్నీ అన్నీ మర్చిపోతున్నారు..!
మీ జీవితం కాఫీ అయితే.....మీ ఉద్యోగం, డబ్బు, పరపతి అన్నీ కాఫీ కప్పులాంటివి...!
ఇవన్నీ కేవం పనిముట్లలాంటివే... కాబట్టి ఆ కప్పు మీ జీవితాన్ని శాసించనీయకండి...! కప్పులోని కాఫీని ఆస్వాధించటం నేర్చుకొండి.
అప్పుడే ‘ఆనందంగా’ ఉంటారు. అదే జీవితం సత్యం...!

Comments

Popular Posts