ఆకుకూరలు ఫ్రిజ్ లో నిలువ ఉంచినపుడు వాడిపోయినట్లు అవకుండా, తాజాగా ఉండాలంటే...

ఆకు కూరలు తెచ్చిన వెంటనే వాటికి కట్టి ఉన్న రబ్బరు బ్యాండ్లు, తాళ్ళు తీసేయాలి. తర్వాత చల్లని నీటితో వాటిని కడిగి పాడైపోయినవి, కుళ్లిన వంటివాటిని తీసేయాలి. వేటికవి విడదీసి విడివిడిగా కవర్లలో పెట్టి భద్రపరచుకోవాలి.ఫ్రిజ్‌లో భద్రపరిచే ఆకుకూరలు కాస్త వాడిపోయినట్లుగా కనిపిస్తాయి. అలా కాకుండా ఉండాలంటే, ఆకుకూరల కాడలను ట్రిమ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసిన చివర్లను ఒక చిన్న పాత్రలో నీటిలో ఉంచుతూ పైభాగాన్ని కవర్‌తో కప్పి ఉంచాలి. ఇలా చేయడం వల్ల అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. 

Comments

Popular Posts