"యల్లమందమ్మ" అందరికీ స్ఫూర్తిదాయకం!

దేహముంది! ప్రాణముంది! నెత్తురుంది! సత్తువుంది! ఇంతకన్నా జీవన పోరాటానికి వేరే సైన్యం అవసరమా? ముసలితనం మీదపడుతున్నా.. కాళ్లు, చేతులు కదలాడుతున్నంత కాలం ఒకరిమీద ఆధారపడి జీవనం సాగించేందుకు ఇష్టపడని గుణం ఆమెది. చేరదీసే కొడుకున్నా.. పనులేవీ చేయవద్దని వారిస్తున్నా.. అతని పంచకు చేరని నైజం ఆమెది. పేరు యల్ల మందమ్మ. గుంటూరులో నివాసం. వయసు 70 ఏళ్లు. తెల్లవారగానే సద్ది కట్టుకుని.. గడ్డి కోసం సైకిలెక్కి నాలుగు కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గడ్డిమోపు తీసుకొచ్చి రూ.100లకు అమ్ముతుంది. నాలుగేళ్లనుంచి ఇదే ఈమెకు జీవనాధారం. విశేషమేంటంటే దారిలో రెండు కిలోమీటర్లు రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో దగ్గర్లోని తెనాలి రైలు ట్రాక్‌పై (రోజుకు మూడు రైళ్లు మాత్రమే రాకపోకలు సాగించే ట్రాక్‌) గడ్డిమోపుతో ఉన్న సైకిల్‌ను తోసుకుంటూ వస్తుంది. ఎంతో అనుభవం ఉన్నవారికీ సాధ్యం కాని ఈ పనిని సునాయాసంగా చేసుకుంటూ ముందుకు సాగుతున్న ఈమె గమనం నిజంగా ఆదర్శనీయం.
-అంజిబాబు

Comments

Popular Posts