పిల్లలకు పరగడుపున క్యారట్ జ్యూస్ ఇస్తే..........

పరగడుపున క్యారెట్ రసం తాగితే కడుపులో ఉండే పురుగులు నశిస్తాయి. పిల్లలకు క్యారెట్ రసం మంచి ఔషధంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పిల్లలు క్యారెట్ జ్యూస్ తీసుకోవడం ద్వారా జీర్ణకోశ వ్యాధులు నయమౌతాయి. క్యారెట్ జ్యూస్ జ్ఞాపకశక్తిని కలిగిస్తుంది. రోజూ ఒక గ్లాసుడు క్యారెట్ రసం పిల్లలకు ఇస్తే జ్ఞాపకశక్తికి టానిక్‌లా పనిచేస్తుంది.
 
కామెర్లు, క్షయ, మొలల వ్యాధి ఉన్న వాళ్ళూ రోజూ రెండు క్యారెట్లు తినడం మంచిది. మధుమేహంతో బాధపడేవారు, షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచేందుకు క్యారెట్ ఎంతగానో ఉపకరిస్తుంది. పచ్చడి రూపంలో కూడా క్యారెట్‌ను వాడవచ్చును. చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని మజ్జిగలో వేసుకుని తినవచ్చు. క్యారెట్ రక్తాన్ని శుభ్రపరుస్తుంది. ఒక ఐరన్ క్యాప్సూలు బదులుగా ఒక క్యారెట్ తింటే సరిపోతుంది.  

Comments

Popular Posts