మీ దృష్టిలో "జంటిల్మన్ "అంటే ఎవరు?


మనకు తెలియకపోయినా వారి యొక్క ఆహార్యమును చూచి వారిపై ఒక నిర్ణయానికి వస్తాము.మంచి దుస్తులు మెడలో టై, పైన మంచి కోటు, కాలికి మంచి బూటు, హుందాగా స్టైల్ గా మాట్లాడటం...ఇతర హంగులు చూసి జంటిల్మన్ అంటూ ఉంటారు.
స్వామి వివేకానంద మొదటి సారి అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ వీధులలో ఒంటరిగా వెళుతుంటే నఖశిఖ పర్యంతం కాషాయదుస్తులతో తలపాగా ధరించి ఉన్న స్వామివారిని ఓ అమెరికన్ దంపతులు చూసి.. భార్య భర్తతో జంటిల్మన్ వస్తున్నాడు అని వ్యంగ్యంగా అంది.
వివేకానందునికి ఆమె మాటలు వినిపించి ఆమె దగ్గరకు వెళ్ళి అడిగారు "సోదరీ! నాగురించే కదా జంటిల్మన్ 
అన్నారు". ఆమె "అవును" అంది. అప్పుడు ఆయన "సోదరీ! మీదేశంలో జంటిల్మన్ ను చక్కగా దుస్తులు కుట్టే దర్జీ తయారుచేస్తాడు. మా దేశంలో ఋషులు తయారు చేస్తారు. దర్జీ కుట్టిన వినూత్నమైన దుస్తులు ధరించిన వారు వారి హృదయాలలో ఎటువంటి భావాలున్నా జంటిల్మన్ లవుతారు. మా దేశంలో దుస్తులు ఎటువంటివి ధరించినా అతనిలో మంచి సంస్కారములు, మహాత్ముల ఆధ్యాత్మిక స్పర్శ ఉంటేనే జంటిల్మన్ అవుతారు. జంటిల్మన్ పదానికి నిర్వచనంలో మీకు మాకు అంత తేడా ఉంది" అన్నారు .
ఆ దంపతులు వివేకానందుని మాటలకు వారింటికి అతిధిగా ఆహ్వానించారు.అనంతరం వారి శిష్యులయ్యారు.
నమో జనని భారతావని. సకల సౌఖ్య సంధాయని.
-హరి ఓం సత్యనారాయణ 

Comments

Popular Posts