క్రిమినాశకాలైన రసాయన మందులకు ప్రత్నామ్నాయంగా ఉపయోగించే "వేపగింజల కషాయం" తయారీ మరియు పిచికారి పద్ధతులు


వ్యవసాయదారులు సస్యరక్షణలో ఉపయోగించే ఒక ద్రవ పదార్థం- "వేపగింజల కషాయం". దీనిని క్రిమినాశకాలైన రసాయన మందులకు ప్రత్నామ్నాయంగా రైతులు వాడుతున్నారు.
వేపగింజల కషాయం తయారు చేయటకు (5 శాతం వేపగింజల కషాయం గల 100 లీటర్ల ద్రావణం తయారీకి) కావలసిన పదార్ధాలు:
బాగా ఎండిన వేప గింజల విత్తనాలు – 5 కేజీలు.
నీరు – 100 లీటర్లు.
సబ్బు పొడి -200 గ్రాములు.
వడపోత కోసం పలుచని గుడ్డ.

తయారీ పద్ధతి:
అవసరమైన 5 కేజీల వేప గింజల విత్తనాలను తీసుకోవాలి.

విత్తనాలను నూరి పొడి చేయాలి
20 లీటర్ల నీటిలో ఒక రాత్రంతా నానబెట్టాలి.
ఉదయాన్నే కర్రపుల్లతో ద్రావణాన్ని పాల తెలుపు రంగు వచ్చే వరకు బాగా కలయ తిప్పాలి.
పలుచని గుడ్డసంచితో వడపోసి 100 లీటర్ల ద్రావణం తయారు చేయాలి.
1 శాతం సబ్బు పొడిని ద్రావణంలో కలిపి తిప్పాలి.
ద్రావణాన్ని బాగా కలిపి ఉపయోగించుకోవాలి.

ముఖ్య సూచనలు:
వేప కాయలను కాయలు కాసే కాలంలో సేకరించి, నీడలో గాలికి ఆరబెట్టాలి.
ఎనిమిది నెలల కంటే ఎక్కువ సమయం ఉన్న విత్తనాలను ఉపయాగించరాదు. ఈ వయసు కంటే ఎక్కువ దాచి ఉంచిన విత్తనాలు ద్రావణం తయారికి పనికిరావు.
ఎల్లప్పుడు తాజాగా తయారుచేసిన వేప గింజల కషాయ ద్రావణాన్ని ఉపయాగించాలి.
మంచి ఫలితాలు రావాలంటే ద్రావణాన్ని 3.30P.M తర్వాత పిచికారి చేయాలి.

Comments

Popular Posts