పక్షవాతానికి గురిచేసే "కల్తీ పసుపుపొడి"....కల్తీ పసుపును సులభంగా గుర్తించవచ్చు!

కొందరు అక్రమంగా ఇతర పొడులకు 'మెటానిల్ ఎల్లో' అనే రంగు కలిపి పసుపు రంగులోకి మార్చి, ఆ పొడిని ప్యాకెట్లలో పెట్టి పసుపుగా మార్కెట్లలో విక్రయిస్తున్నారు.

ఇలాంటి పసుపును ఎక్కువగా వాడితే పక్షవాతం వస్తుందని వైద్యులు చెబుతున్నారు. 

ఈ కల్తీని ఎలా గుర్తించాలి: పసుపు పొడిని కొద్దిగా చెంచాలో తీసుకుని, దానికి బాత్‌రూం కడిగే యాసిడ్‌ను కలిపితే అది గులాబీ రంగులోకి మారుతుంది. దీనిలో నీళ్లు పోస్తే గులాబీ రంగుపోయి, తిరిగి పసుపు రంగులోకి మారితే అది నిజమైన పసుపు పొడి.మారకపోతె కల్తీ పసుపు అని గుర్తించాలి. 

Comments

Popular Posts