కేన్సర్ కి దారితీసే "కల్తీ కారంపొడి"! అలాంటి కల్తీ కారాన్ని సులభంగా గుర్తించవచ్చు!

కొందరు కారం పొడిలో అధిక మొత్తంలో రంపపు పొట్టు, రంగు వచ్చేలా 'కాంగోరెడ్' అనే కెమికల్ కలిపి,  దానిని ఎరుపు రంగులోకి మార్చి, ఆ పొడిని  ప్యాకెట్లలో పెట్టి 'బ్రాండెడ్ రెడ్ చిల్లీపౌడర్' గా మార్కెట్లలో విక్రయిస్తున్నారు. 
ఇలాంటి కారమును ఎక్కువగా వాడితే కేన్సర్ వస్తుందని వైద్యులు చెబుతున్నారు. 
ఈ కల్తీ కారాన్ని ఎలా గుర్తించాలి: కారం పొడిని కొద్దిగా చెంచాలో తీసుకుని, దానికి బాత్‌రూం కడిగే యాసిడ్‌ను కలిపితే అది గులాబీ రంగులోకి మారుతుంది. దీనిలో నీళ్లు పోస్తే గులాబీ రంగుపోయి, తిరిగి ఎరుపు రంగులోకి మారితే అది నిజమైన కారం పొడి.మారకపోతె కల్తీ కారం అని గుర్తించాలి

Comments

Popular Posts