పరగడుపున అరటిపండ్లు తినవచ్చా?

వైద్య నిపుణుల సలహా మేరకు అరటిపండ్లను పరగడుపున తినకూడదట.  అరటిపండ్లలో సహజసిద్ధమైన చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు అవి మనకు బాగా శక్తిని ఇస్తాయి. కానీ తర్వాత వెంటనే ఆ శక్తి ఖర్చవగానే నీరసంగా అనిపిస్తుంది. అలాగే ఉదయాన్నే అసలే నిద్రమత్తులో ఉంటాం. అలాంటపుడు పరగడుపున అరటిపండ్లను ఆరగించడం వల్ల కడుపు నిండినట్లు అనిపించింది మరింతగా నిద్ర మబ్బులోకి జారుకోవాల్సి వస్తుందట. 

అంతే కాకుండా, అరటిపండ్లు సహజసిద్ధంగానే యాసిడిక్ గుణాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల వాటిని ఖాళీ కడుపుతో తింటే జీర్ణ సమస్యలు ఉత్పన్నమవుతాయని అందువల్ల అరటిపండ్లను ఖాళీ కడుపుతో తినరాదని వైద్య నిపుణులు చెపుతున్నారు. 

Comments

Popular Posts