పాలు ‌తాగి జీర్ణం చేసుకోలేని వారు....పాలకు బదులు తీసుకోదగిన ఆహార పదార్ధములు......

క్యాల్షియాన్ని శరీరానికి అందించే పాలు తాగినపుడు అరగకపోతే.. ప్రత్యామ్నాయాలుగా తృణ ధాన్యాలు, కూరగాయలు, వేరుశెనగ, బాదం, జీడిపప్పు, పిస్తా వంటివి రోజువారీగా అర గుప్పెడు తీసుకోవడం ద్వారా క్యాల్షియం పొందవచ్చు. 
వేరుశెనగని కనీసం ఆరు గంటల పాటు నీళ్ళలో నానబెట్టాలి. దీనివల్ల పిత్తానికి సంబంధించినవన్నీ తొలగిపోతాయి. నానబెట్టకుండా వేరుశెనగను తింటే, అది దద్దుర్లను, వికారాన్ని కలిగిస్తుంది.
అలాగే ఉలవలు కూడా శరీరానికి కావలసిన క్యాల్షియాన్ని అందిస్తాయి. ఐరన్, క్యాల్షియంలకు ఉలవలు మేలు చేస్తాయి.  ఉలవల్ని మొలకెత్తించి తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. మొలకెత్తిన ఉలవలు చాలా సులభంగా జీర్ణమవుతాయి. ఉలవలు శరీరంలోని ఉష్ణాన్ని పెంచుతాయి. దీనివల్ల దగ్గు, జలుబులను నివారించుకోవచ్చు. వర్షాకాలం, శీతాకాలంలో ఉలవలు తీసుకోవచ్చు. కానీ ఎండాకాలంలో వాడిని వాడటం తగ్గించాలి. లేకుంటే శరీరం లో వేడి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Comments

Popular Posts