నా తండ్రి ఒక ముస్లిం. నా తల్లి హిందూ.నా తండ్రి ఒక ముస్లిం.
నా తల్లి హిందూ.
వారు ప్రేమ వివాహం చేసుకున్నారు.
మేము హైదరాబాద్లో ముస్లింల ఆధిపత్య ఉండే ప్రాంతంలో నివసించేవాళ్ళం.

నా తల్లి ఎంతో  ప్రేమ మరియు  ఆప్యాయత లతో నన్ను పెంచింది.ప్రతి రోజూ ఉదయం భజనలు పాడుతున్న నా తల్లి యొక్క శ్రావ్యమైన గొంతు విని నేను నిద్ర మేల్కొనేదాన్ని. అలాగే సాయంత్రం నా తండ్రి  చేసే ప్రార్థనలను శ్రధ్ధగా గమనించేదాన్ని. అలా అని నేను ఏదో ఒక్క ‌మతాన్నే అనుసరించలేదు.దీని గురించి నా తల్లిదండ్రులు ఏనాడూ ఒత్తిడి చేయలేదు.

2012 లో నా తల్లి మరణించింది.ఎంతో ఆనందంగా సాఫీగా సాగుతున్న నా జీవితంలో అప్పటి నుండి సమస్యలు మొదలయ్యాయి.

మా ఇంటికి నా తండ్రి తరపున దాయాదులు, ఆ ప్రాంతంలో ఉండే మతపెద్దలు,  ముల్లాలు, చాచాలు ఇలా వచ్చేవారు.పరామర్శకు వచ్చినవారు అలాగే వెళ్ళేవారు కారు. . అనవసరపు ఉచిత సలహాలు ఇస్తూండేవారు
వాటిలో కొన్ని :
ఒక ముస్లిం మహిళతో రెండో పెళ్లికి  ‌నా తండ్రిని ఒప్పించడం
ఒక  ముస్లిం అబ్బాయితో నా పెళ్లి జరిపించమని బలవంతపెట్టడం
నా పేరును పూర్తి ముస్లిం పేరుగా మార్చుకోమని చెప్పడం......... 

రోజు రోజుకి వారి సలహాలు వేధింపులు ఎక్కువవడంతో నేను తీవ్ర మనోవేదనకు గురయ్యాను. నాకు మనశ్శాంతి లేకుండా చేసేవారు.

ఒకరోజు ఒక మౌల్వి మా ఇంటికి వచ్చి, నా భవిష్యత్ ప్రణాళికలను గురించి అడిగారు. వాస్తవానికి అతను వచ్చింది నాకు ఒక వృద్ధునితో నిఘా చేయాలని. నాకు బాధ, ఆవేశం, ఏడుపు అన్నీ కలిపి ఒక్కసారిగా వచ్చాయి. 

నిస్సహాయ వస్థితిలో ఉన్న నాకు రెండే ‌మార్గాలు.... 
రాజీ పడిపోవాలా? 
తిరగబడాలా?

నేను రెండోది ఎంచుకున్నాను.ఆ మౌల్విపై తిరగబడ్డాను.నాకు అబ్బాయిలంటే ఇష్టం లేదని, నాకు  అమ్మాయిలు నచ్చుతారని,   నేను ఒక లెస్బియన్ అని చెప్పాను (తప్పించుకోవడానికి ఇలా అబద్ధం చెప్పాను). నేను  ముంబైకి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నానని కూడా అన్నాను. 

అతనికి మతి పోయింది.ఇస్లాంను అవమానపరిచానని అతను నన్ను  దూషించాడు.నేను ఒక లెస్బియన్ ఆపడానికి కారణం నా తల్లి అని ఏ పాపం ఎరుగని ఆమెను కూడా  నిందించాడు.

చివరకు అతను మొత్తం కాలనీని ఏకం చేసి నన్ను వెలివేయించాడు.నాకు‌ఏమి చేయాలో తెలియలేదు, గుండె లవిసేలా ఏడవటం తప్ప. ఎలాగోలా గుండె దిటవు చేసుకుని నా లగేజ్ ప్యాక్ చేసుకుని ముంబైకి వెళ్ళాను. (తర్వాత ఎప్పుడూ తిరిగి రాలేదు.)

ముంబాయిలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసాను.ఉద్యోగంలో చేరి నా జీవితం నేను జీవిస్తున్నాను. 
నా తండ్రి మరొక స్త్రీని వివాహంచేసుకున్నా డు.మా మధ్య మాటలు లేవు. అలా అని ద్వేషం లేదు.

భారతదేశంలో మహిళగా నా అభిప్రాయం ఏమిటి అంటే దాదాపు ఇక్కడ స్త్రీ అభిప్రాయాలు ఖచ్చితంగా గౌరవించబడవు.వారి సమస్యలు సీరియస్ గా పరిగణించబడవు. కేవలం కంటితుడుపు మాటలు, చర్యలు తప్ప.పాపం, కొందరు అబలలు వాటికీ నోచుకోవడం లేదు. ఏ ఒక్క మతమో, కులమో, ప్రభుత్వమో దీనికి కారణం కాదు. బాధ్యత అందరికీ ఉండాలి. 

అన్నింటికన్నా ముఖ్యం......... "ఆడదాని" పట్ల "మగాడి" ధృక్పథం మారాలి. అలాగే ప్రతి స్త్రీ సహనంతో పాటు శక్తిని పెంపొందించుకోవాలి. 

-జయంతి షేక్. 

Comments

Popular Posts