గుడి యొక్క నీడ ఇంటిపై పడటం వలన అనారోగ్యాలు, అశుభాలు కలుగుతాయా?

సాధారణంగా ఏ కష్టం వచ్చినా … ఏ నష్టం వచ్చినా అందరూ ఆ దేవుడితోనే చెప్పుకుంటూ వుంటారు. ఈ నేపథ్యంలో ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకుంటూ వుంటారు. దేవుడు ఎంతో గొప్పవాడు … గుడి ఎంతో పవిత్రమైనది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అలాంటి గుడి నీడ ఇంటిపై పడటం వలన అనారోగ్యాలు కలుగుతాయని పూర్వీకులు చెబుతూ వచ్చారు.

ఇప్పటికీ ఈ విషయాన్ని అంతా విశ్వసిస్తుంటారు. ఈ కారణంగానే గుడి నీడ పడనంత దూరంలో ఇళ్లు కడుతుంటారు. ఈ విషయంలో గుడి ‘నీడ’ ప్రమాదకరమైనదని భావించకూడదు. అంత దగ్గరలో ఉండకూడదని పెద్దలు ఈ నియమాన్ని విధించారు. గర్భాలయంలో మూలవిరాట్టును యంత్ర సహితంగా ప్రతిష్ఠ చేస్తుంటారు. అందువలన ఆ యంత్రంలో నుంచి శక్తి తరంగాలు విగ్రహం ద్వారా బయటికి ప్రసరించ బడుతుంటాయి. ఈ శక్తిని గ్రహించడం కోసమే మనం ఆలయానికి వెళ్లగానే ప్రదక్షిణలు చేస్తుంటాం.
ఈ శక్తి తరంగాలు గుడి చుట్టూ ఒక పరిధిలో తమ ప్రభావం చూపుతుంటాయి. అలాంటి తరంగాలు సూర్య శక్తితో కలిసినప్పుడు హానికరంగా మారతాయి. అలా హానికరంగా మారిన తరంగాలు నిత్యం దగ్గరగా వుండే వ్యక్తులపై వ్యతిరేక ప్రభావం చూపి వారిని అనారోగ్యానికి గురిచేస్తుంటాయి. అందువల్లనే గుడి గోపురం నీడ … ధ్వజ స్తంభం నీడ పడనంత దూరంలో నివాసం వుండాలని అంటారు

Comments

Popular Posts