మన ముందే ఎవరైనా గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోతే తక్షణమే మనం ఏమి చేయాలి?

గుండెపోటు-ప్రథమ చికిత్స (వైద్య సహాయం అందేలోపు చేయదగినది మాత్రమే!!):

 
అదెలాగంటే...
  • గుండె పోటు వచ్చిన మనిషిని ముందుగా పడుకోబెట్టాలి.
  • శ్వాస కొట్టుకుంటుందో లేదో చూడాలి. ఛాతీ మీద చెవి పెట్టి లబ్‌ డబ్‌ లు వినాలి. హృదయ స్పందన ఆగిపోయి ఉంటే, 'కార్డియాక్‌ మసాజ్‌' ఆరంభించాలి.
  • 'కార్డియాక్‌ మసాజ్‌:ఇదో ప్రత్యేకమైన ప్రక్రియ. రోగిని పడుకోబెట్టి పక్కనే మోకాళ్ల మీద కూర్చుని రెండు చేతులనూ కలిపి బలంగా ఛాతీ ఎముక మీద లయబద్దంగా నొక్కుతూ ఉండాలి. దీనివల్ల గుండె పంపింగ్‌ జరిగి రక్త ప్రసరణ పెరుగుతుంది. అదే సమయంలో అంబులెన్స్‌ కు సమాచారం అందించాలి. దగ్గరలోని ఆస్పత్రికి వెంటనే తరలించాలి.
  • గుండె పోటుకు సంబందించినంత వరకు మొదటి గంట చాలా ముఖ్యమైనది. తొలి గంటలో సరిగా చికిత్స అందితే బతికే అవకాశాలు 90 శాతం ఉంటాయి. ఆలస్యమైన కొద్దీ ప్రాణ గండమే. బంధుమిత్రుల్లో, సహోద్యోగుల్లో ఎవరికైనా మద్యం, పొగతాగే అలవాటు ఉంటే గుండెపోటు వచ్చే ప్రమాదం పొంచి ఉందని గుర్తుంచుకోండి. అలాంటి వారు ఛాతీ లో నొప్పి గా ఉంది అని అంటే వెంటనే అప్రమత్తమై ప్రథమ చికిత్స అందివ్వండి.

Comments

Popular Posts