కోరికల్ని ఎలా జయించాలి? తృప్తిపరిచా ? లేక అణచివేశా ?

భక్తుడు : కోరికలను వదల్చుకోవడానికి వాటితో ఏ విధంగా వ్యవహరించాలి? వాటిని తృప్తిపరిచా? లేక అణచివేశా?
భగవాన్ రమణ మహర్షి: తృప్తి పరచితే కోరిక నశించేటట్లయితే తృప్తిపడటంలో నష్టంలేదు. కానీ సామాన్యంగా కోరికలేవీ ఆ రకంగా నశించిపోవు. అలా చేయడం మంటలను ఆర్పడానికి పెట్రోలును మంటలమీద పోయడంలాంటిది. బలవంతంగా కోరికలను అణచడం సరియైన మార్గం కాదు. అణచిన కోరికలు అపుడు కాకపోయినా ఇంకొక్కప్పుడైనా విజృంభించి చెడు ఫలితాలకు కారణమవుతాయి.
కోరికలను వదల్చుకోవడనికి సరియైన మార్గం -
ఈ కోరిక లెవరికి? మూలమేమి ? అని తెలుసుకోవడమే.
అలా తెలుసుకున్న తరువాత ఆ కోరిక సమూలంగా నశించిపోతుంది. ఆ తరువాత అని మళ్ళీ తలెత్తడం, పెరగడం ఉండదు. కాలకృత్యాలు తీర్చుకోవడం, తినడం, తాగడం లాంటి చిన్న అవసరాలు తీర్చడంలో ఇబ్బందిలేదు. అవి నీ మనసులో వాసనలను నాటి ఇంకో జన్మకు కారణం కాదు. ఆ పనులన్నీ జీవితాన్ని గడపడానికి అవసరమౌతాయేగానీ వాసనలుగా మారే అవకాశం లేదు. తృప్తి పరచడం ద్వారా ఇంకా ఇంకా కోరికలు పెరిగి మనసులో కొత్త వాసనలను కల్పించనట్టి కోరికలను తృప్తిపరచడంలో నష్టంలేదు అని సామాన్యమైన సూత్రం.

Comments

Popular Posts