పంచ మహా యజ్ఞములు


పృధ్విలో పుట్టిన ప్రతి మానవుడు ను ప్రతి దినమును ఈ యజ్ఞములు ఆచరించ వలెను. ఈ యజ్ఞములు- ఐదు .1 . దేవ యజ్ఞము 2 . పిత్రు యజ్ఞము 3 . భూత యజ్ఞము 4 . మనుష్య యజ్ఞము 5 . బ్రహ్మ యజ్ఞము .
  1. దేవ యజ్ఞము : దీనినే వైశ్వ దేవ మందురు . గృహస్థులు గార్హ పత్యాగ్నిలో దేవతల నుద్దేశించి చేయుదురు. బ్రహ్మ చారులైనచో లౌకికమైన అగ్ని లేనే అగ్ని కార్యము చేయుదురు .(గృహస్థులు చేయునది మాత్రమే వైశ్వ దేవము ) శూద్రులకు నమస్కారమే దేవ యజ్ఞ ఫలము నిచ్చును.
  2.  పితృ యజ్ఞము : ఇది తల్లి దండ్రులు లేనివారు చేయునది . పితృ వర్గమును, మాతృ వర్గమును చెప్పుచు స్వదాకారముతో జలముతో గాని , తిలలు గలిపిన జలముతో గాని తర్పణము చేయుటే పితృ యజ్ఞము. తండ్రి లేని వానికే తర్పణము చేయు అధికార ముండును. తండ్రి జీవించి యున్నప్పుడు తల్లి లేని వానికి గూడ తర్పణము చేయు అధికారము లేదని కొందరి మతము .
  3. భూత యజ్ఞము : గృహస్థుడు తాను భోజనము చేయుటకు ముందు ఇంటి పరిసరములలో తిరుగు కాకులకు ఇతర జంతులకును ఆహారము పెట్టుటయే భూత బలి . ఇది యెవ్వరైనను భూత దయ గలవారు చేయవచ్చును .
  4.  మనుష్య యజ్ఞము : ఇంటికి వచ్చిన అతిదులను ,అభ్యాగతులను , సత్కరించి భోజనము పెట్టుట ,లేదా సాముహిక సమారాధనలు (అన్నదానములు ) జరుగునపుడు యధాశక్తిగా ధనమును గాని వస్తు సంభారములను గాని ఇచ్చి సహకరించుట .
  5. బ్రహ్మ యజ్ఞము : ఋగ్వేదము ,యజుర్వేదము ,సామవేదము , అధర్వణ వేదము అను నాల్గింటిలో తమ శాఖకు చెందిన వేద భాగమును అధ్యయనము చేయుట ,లేదా ! అధ్యయనము చేసిన దానిని పునశ్చరణము చేయుట బ్రహ్మ యజ్ఞ మనబడును.
శూద్రాది వర్ణముల వారు బ్రహ్మ జ్ఞానులైన ఋషులు రచించిన పురాణములను ధర్మ శాస్త్రములను చదువుట లేక వినుట బ్రహ్మ యజ్ఞ మగును.
బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ప్రతి దినము ఉదయమునను., మద్యాహ్నమునను ,సాయంకాలమునను మంత్ర యుక్తముగా సంధ్యో పాసనము చేయవలెను. ” అహరహ స్సంధ్యా ముపాసీత ” అని పెద్దల యాదేశము.
శూద్రాది వర్ణములవారు ఉదయముననే స్నానము చేసి జగత్కర్మ సాక్షి యైన సూర్యునికి నమస్కారము చేసి ధ్యానించి నచో అది సంధ్యా వందన మగును. సాయంకాలము కూడా ఇట్లే చేయవలెను .

Comments

Popular Posts