'కబంధ హస్తములు'

రామాయణములో రామలక్ష్మణుల చేత సంహరింపబడిన, దండకారణ్యములో ఉన్న ఓ వికృతరూపము గల రాక్షసుడు-'కబంధుడు' . ఇతడు దట్టమయిన రోమములు గలవాడనియు, పర్వతమువంటి భీకరమైన శరీరముగలవాడనియు, తల మరియు మెడ లేనివాడనియు, ఉదరభాగమునందు క్రూరమయిన దంతములు గల నోరు గలవాడనియు, పొడవాటి చేతులు మరియు వక్షమందు ఓ పెద్ద కన్ను కలవానిగను వర్ణించిరి. కొందరు ఇతడు లక్ష్మీదేవి కొడుకుగా చెప్పిరి. ముందుగా కబంధుడు ఒక గంధర్వుడు ఒక ముని శాపముచే కబంధునకు ఆ వికృత రూపము ప్రాప్తించెను.రామలక్ష్మణులు ఇతనిని సంహరించి శాపవిమోచనం గావించారు.
ఇతని చేతులలో చిక్కిన వారికి తప్పించుకొనుట అసాధ్యముగా ఉండెను. 'కబంధ హస్తములు' అనే వ్యావహారిక పదము కూడా ఇలా వఛ్చినదే.

రామ లక్ష్మణులు కబంధుని సంహరించుట (Source)
Comments
Post a Comment