వైద్యసహాయం అందేలోపు చేయవలసిన 'ప్రాధమిక ప్రథమ చికిత్స' గురించి కనీస అవగాహన

ఆరోగ్యమును పరిరక్షించడానికి, అనారోగ్యము ను, చిన్న చిన్న గాయాలు కు, సాదారణ శరీరరుగ్మతలకు, నిపుణుల వైద్యము అందేవరకు తాత్కాలికంగా చేయు ఉపయుక్తకరమైన వైద్యవిధానాన్ని ప్రథమ చికిత్స (First-aid) అందురు. ట్రైనింగు ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు కూడా ప్రథమచికిత్స చేయవచ్చును. ఒక్కొక్కప్పుడు దీనివలన ప్రాణాలను కాపాడవచ్చును. కట్లు కట్టడము, రక్తము పోకుండా ఆపడము, ఊపిరి ఆడడము కష్టముగా ఉన్నప్పుడు కుత్రిమ శ్వాస ఇవ్వడము, మొదలుగునవి.
                               First-Aid Symbol
దీనిలో ముఖ్యముగా మూడు ఉద్దేశములున్నవి.
1.ప్రాణాన్ని నిలపడము
2.ఉన్న గాయాన్ని ఎక్కువవకుండా చూడడము.
3.బాధ నుండి బయటపడడానికి సహాయము చేయడము.

ప్రధమచికిత్స అవసరమున్న పరిస్థితులు:
 • రోడ్డు ప్రమాదములో గాయపడ్డ సమయమందు
 • వ్యక్తి మంటలలో చిక్కుకున్న సమయములో
 • కారణం ఏదైనా.. రక్తం ఎక్కువగా పోతున్న సమయాలలో
 • వ్యక్తి పాము కాటుకి గురియైనపుడు
 • వ్యక్తి ఉరి వేసుకున్న ప్రయత్నము న ఆయాసపడుతున్నపుడు
 • బాధలో వున్న ప్రతి ప్రాణికి ప్రథమచికిత్స అవరము ఉంటుంది. సమయము, సందర్భము ఇది అని కచ్ఛితముగా చెప్పలేము. సమయస్ఫూర్తితో వైద్య సాయము అందించడమే ప్రథమచికిత్స.
 
ప్రథమచికిత్స.-పరికరాల పెట్టె:
ప్రథమ చికిత్స పరికరాల పెట్టె (First-aid Box) ప్రతి కర్మాగారం, ఆఫీసు, పాఠశాల, ఇళ్లల్లో అందరికీ అందుబాటులో ఉండాలి. మన ఇంట్లో రేకు లేదా అట్టపెట్టెతో ప్రథమ చికిత్స బాక్స్ ను తయారు చేసుకోవచ్చు. సుళువుగా అందుబాటులో ఉండేలా మీ ప్రథమ చికిత్స పెట్టెను ఏర్పాటు చేసుకోవాలి. గడువు తీరిన ఔషధాలను పారేసి, తాజా ఔషధాలను బాక్స్ లో పెట్టాలి. ఈ క్రింద పేర్కొన్న పరికరాలు, వస్తువులు మీ ప్రథమ చికిత్స పెట్టెలో ఉండాలి.
 • వివిధ రకాల సైజుల్లో అతుక్కునే గుణం గల బ్యాండేజీలు
 • పీల్చుకునే గుణం గల (అబ్జార్బెంట్) నూలు బ్యాండేజీ లేదా రకరకాల సైజుల్లో ఉన్న నూలు గాజ్ ప్యాడ్లు
 • అతుక్కునే పట్టీలు
 • త్రికోణపు బ్యాండేజీ చుట్ట
 • ఒక చుట్ట దూది
 • బ్యాండ్ -ఎయిడ్స్ (ప్లాస్టర్స్)
 • కత్తెర
 • పెన్నుసైజు టార్చిలైటు
 • చేతులకు వేసుకునే తొడుగులు (రెండు జతలు)
 • ట్వీజర్స్ (పట్టుకర్ర)
 • సూది
 • తడిగా గల తువ్వాలు మరియు శుభ్రమైన పొడి బట్ట ముక్కలు
 • యాంటీ-సెప్టిక్ ద్రవం (సేవ్లన్ / డెట్టాల్)
 • ఉష్ణమాపి (థర్మోమీటర్)
 • ఒక చిన్న పెట్రోలియం జెల్లీ ట్యూబ్ లేదా ఇతర ల్యూబ్రికెంట్ (పొడిబారిన చర్మాన్ని మెత్తబరిచే క్రీములు)
 • వివిధ రకాల సైజుల్లో పిన్నీసులు (సేఫ్టీ పిన్నులు )
 • సబ్బు లేదా డిటర్జెంట్ పొడి
 • ఔషధాలు ఆస్పిరిన్ లేదా నొప్పి తగ్గించే పారాసెటమాల్ మాత్రలు
 • విరేచనాలు అరికట్టే (యాంటీ–డయోరియా) ఔషధాలు
 • తేనెటీగలు వంటి కీటకాలు కుట్టిన చోట్ల పూయటానికి యాంటీ హిస్టమిన్ క్రీము (అలర్జీలు/దురదలు/మంటలు తగ్గేందుకు క్రీము)
 • అజీర్తి మరియు అసిడిటికి మాత్రలు (ఆంటాసిడ్ మరియు ఎంజైము మాత్రలు)
 • విరేచనం సాఫీగా అవ్వటానికి (ల్వాక్సెటివ్) మాత్రలు
 

Comments

Popular Posts