విష వాయువు / గ్యాస్ పీల్చినచో వైద్యసహాయము అందేలోపు చేయదగిన ప్రథమచికిత్స


  
ఎవరికైనా గ్యాస్/వాయువులు పీల్చుట వలన ప్రమాదము సంభంవించినప్పుడు మనమా వ్యక్తిని రక్షించుటకు SCBA ను ధరించి వెళ్ళవలెను. లేనిచో ఆ గ్యాస్/వాయువులు మనకు కూడా హాని కలిగించగలవు. కాబట్టి తగిన రక్షణ తొడుగులను ధరించి ఆ వ్యక్తిని ప్రమాద ప్రదేశాల నుంచి దూరానికి తరలించవలెను. ఆ వ్యక్తిని సురక్షిత ప్రదేశములో పరుండ బెట్టి, బిగుతుగానున్న దుస్తులను వదులు చేసి, స్రృహలేనట్లయితే అతనికి శ్వాస, గుండె, పని చేస్తోంది, లేనిది గమనించాలి.
శ్వాస లేనట్లయితే, మొదట అతని శ్వాస నాళాన్ని సరిచేసేందుకు
 • 1. నొసటిపై ఒక చేయుంచి రెండవ చేతితో గడ్డాన్ని పైకి ఎత్తిపట్టాలి.
 • 2. నోటిలో ఏదైనా అడ్డు (ఉదా. కట్టుడు పళ్ళు, పాన్ వగైరా) ఉంటే దానిని తీసివేయాలి.
 • 3. శ్యాసనాళము సరిచేయుట వలన శ్వాస తిరిగి ప్రారంభముకావచ్చును. ఒక వేళ శ్వాస లేకుంటే కల్పిత శ్వాస కలిగించాలి.
 
కల్పిత శ్వాస పద్ధతులు
 • ముందుగా గాలి మార్గాన్ని మెరగుపరచుటకై నొసలుపై ఒక చేయివుంచి, యింకొక చేతితో గడ్డాన్ని ఎత్తి పట్టాలి.
 • నోటితో ఏవైన అన్యపదార్థమలుంటే వాటిని తీసివేయాలి.
 • గాయపడిన వ్యక్తి నోటిపై ఒక గుడ్డను శుభ్రత కొరకై ఉంచాలి.
 • గాయ పడిన వ్యక్తి ముక్కును వ్రేళ్ళతో మూయాలి.
 • ప్రథమ చికిత్స చేయువాడు గట్టిగా గాలి పీల్చుకొని గాయపడిన వ్యక్తి నోరును తన నోటితో పూర్తిగా మూసి గాలిని బలంగా గాయపడిన వ్యక్తి నోటిలోనికి ఊదాలి.
 • ఛాతీ పెద్దదైనదో, లేదో గమనించాలి. ఛాతి పెద్దదైనట్లయితే, గాయపడిన వ్యక్తి ఊపిరితిత్తులలోనికి మీరూదిన గాలి వెళ్ళినట్లు నిర్థారించుకోవాలి. ఈ పని వలన అతను గాలి పీల్చుకున్నట్లయినది.
 • మీ నోటిని అతని నోటిపై నుండి తొలగించాలి. అప్పుడు అతని ఊపిరితిత్తులలోని గాలి బయటకు వచ్చును. ఈ పని వలన అతను గాలి వదిలినట్లయినది.
 • ఈ విధముగ నిముషమునకు 12 సార్లు ఎంతసేపు అవసరముంటే అంత సేపు చేస్తూ అతనిని ఆస్పత్రికి తరలించాలి.
 • దీనిని అతనికి శ్వాస తిరిగి వచ్చినప్పుడు కాని లేక ఒక వైద్యుడు అక్కడకు చేరినప్పుడు కాని లేదా ఆవ్యక్తిని ఆస్పత్రికి చేరినప్పుడు కాని విరమించవచ్చును.
శ్వాస మార్గమును మెరుగుపరుచు పద్ధతి
 • మీరు గాలి అతని నోటిలోనికి ఊదినప్పుడు ఛాతి పెద్దగా కాకున్న యెడల అతని శ్వాస నాళములో దిగువన ఏదో అడ్డున్నట్లు గమనించాలి. 
 • అప్పుడు అతనిని వెల్లకిల పరుండబెట్టి అతని వీపుపై 5 లేక 6 సార్లు గట్టిగా చరచి దవడను పైకి ఎత్తిపట్టి గొంతులో నున్న అన్యపదార్థాన్ని తీసి, నోటినుండి నోటి ద్వారా గాలిని ఊదాలి. 
 • నోటి నుండి ముక్కు ద్వారా కల్పిత శ్వాసను క్రింది సందర్భాలలో ఇవ్వాలి 1. క్రింది దవడ ఎముక విరిగినప్పుడు 2. పెదవులు, నోరు కాలినప్పుడు (ఆమ్లము, క్షారము త్రాగినప్పుడు) 3. వ్యక్తి నోటిలో ఉండగ కల్పిత శ్వాస చేయవలసి వస్తే నోటిపై నోరుంచి గాలి ఊదుటకు బదులుగా అతని నోటిని మూసి, మీ నోటితో అతని ముక్కును మూసి గాలిని ఊదాలి.
 • నోటి నుండి నోరు ముక్కు ద్వారా రోగి చిన్న బిడ్డ అయితే అతని నోరు, ముక్కు చుట్టు నీనోరుంచి అతని రొమ్ముపైకి వచ్చు వరకు నెమ్మదిగా గాలిని ఊదాలి. ఈ విధముగా నిముషమునకు 20 సార్లు చేయాలి.
 
అంబుబ్యాగ్ సహాయంతో నోటి ద్వారా కల్పిత శ్వాస
 
మీ దగ్గర (అంబుబ్యాగ్) అందుబాటులో ఉన్నప్పుడు మాస్క్ ను గాయపడిన వ్యక్తి నోటిపై ఉంచి గాలి బంతిని నొక్కినప్పుడు అతని రొమ్ముపైకి వచ్చును. బంతిని వదిలినప్పుడు రొమ్ము క్రిందికి వెళ్ళి అతని ఊపిరితిత్తులోని గాలి వాల్వ్ ద్వారా బయటకు వెళ్ళును.
 

Comments

Popular Posts