చతుర్దశి, దీపావళి రోజుల్లో ఏ ఏ పూజలు చేస్తారు ?


Source


దీపావళి అంటే ‘దీపాల వరుస’ అని అర్థం. దీప మాలికలతో లక్ష్మీదేవికి నీరాజనమిచ్చే రోజు ఇది. అందుకే, దీనికి ‘దీపావళి’ అన్న పేరు వచ్చింది. ఒక్క మన దగ్గరే కాదు, దేశ విదేశాల్లోని భారతీయులంతా అత్యంత ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకునే పండగ ఇది.
హిందువుల పండుగలలో అతిముఖ్యమైనది ” దీపావళి” . సమగ్ర భరతఖండంలో హిందువులే కాకుండా బౌద్ధులు, జైనులు కూడా ఈ పండుగను జరుపుకుంటారు. ” నరకాసుర సమ్హారము ” మన అందరకూ సుపరిచితమైన విషియమే. అయితే ఈ పండుగను జర్పుకొనే విధానంలో ప్రాంతీయ బేధాలున్నాయి. మనం అమావాస్య ఒక్కరోజే పండుగ చేసుకుంటాం. ఉత్తరాదిన 5 రోజుల పండుగ ఇది. తమిళనాట నరకచతుర్దశి నాడు సూర్యోదయానికి ముందు జరుపుకుంటారు.
నరక చతుర్దశి
ఈ రోజున తెల్లవారకముందే నువ్వులనూనే తలపై వేసుకుని ” ఉత్తరేణి” కొమ్మను నెత్తి మీద ఉంచుకుని తలంటుకోవాలి. అలా తలంటుకునేటప్పుడు “ శీతలోష్ణ సమాయుక్త సకంటకదళాన్విత హరపాప మపామార్గ భ్రామ్యమాణః పునః పునః అని చెప్పుకోవాలి.
స్నానాంతరం నల్లనువ్వులతో “యమాయ తర్పయామి తర్పయామి తర్పయామి ” అంటూ యమతర్పణం విడవాలి. నరకాసురుడు మరణించిన సమయం అది.
ఆపై
యమాయ ధర్మరాజాయ మృత్యువే చాంతకాయచ!
వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయచ!!
ఔదుంబరాయ ధర్మాయ నీలాయ పరమేష్టినే!
మహోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయతే నమః!! అని చెప్పుకోవాలి.
ఇల్లంతా కడిగి ముగ్గులు పెట్టుకోవాలి. ఆ రోజు మినపాకులతోకూర వండుకు తినాలి. వీలుకాకపోతే మినపగారెలైనా సరే. నరకచతుర్దశినే ప్రేతచతుర్దశి అని కూడా అంటారు.
వెలుగు జ్ఞానానికి గుర్తు. సంతోషానికి ప్రతీక. చీకటిని దూరం చేసే దీపం మనిషి వివేకానికి సంకేతం. భారతీయ దివ్య ఋషులు, దార్శనిక శక్తి కల్గిన మహర్షులు మేధోమధనంలో మానవాళి అభివృద్ధి కోసం శాస్త్రాలు రచించి, నియమాలు వివరించిండ్రు. అనేక వేల సంవత్సరాల నుండి మన పూర్వీకులు ఆచరిస్తూ, అనుసరిస్తూ, అభిమానిస్త్తూ వచ్చిందే సంప్రదాయం.
ప్రతి ఆచారం వెనుక ఒక అంతరార్థం, ఒక ప్రయోజనం, ఒక పరమార్థం వుంది. అట్లే ప్రతి ఏడూ మనం వేడుకగా జరుపుకునే దీపావళి పండగకు కూడా మన పూర్వీకులు కొన్ని మూలాలను వివరించిండ్రు. అవే మనందరికీ వెలుగు దివిటీలు అవుతున్నాయి.
దీపావళి అయిదు రోజుల పండగ. తొలిరోజు ధన త్రయోదశి లేదా ధన్వంతరి జయంతి. రెండోరోజు నరక చతుర్దశి. మూడవ రోజే ఘనమైన దీపావళి. ఇక నాలుగో రోజు బలి పాడ్యమి. చివరి రోజును యమ ద్వితీయగా జరుపుకుంటాం.
నరక చతుర్దశి’ ప్రత్యేకతలు
ఆశ్వయుజ బహుళ చతుర్దశిని ‘నరక చతుర్దశి’ అంటరు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై లోక కంటకుడైన నరకాసురుని సంహరించాడు. సర్వలోకాలకు, దేవతలకు ఆనందాన్ని కలిగించిన ఆ రోజును జనమంతా ‘నరక చతుర్దశి’గా జరుపుకోసాగారు.

పురాణ నేపథ్యం:
వరాహ రూపంలో ఉన్న విష్ణుమూర్తివల్ల భూదేవికి నరకుడు పుడతాడు. యోగనిద్ర నుండి లేచిన విష్ణుమూర్తిని భూదేవి కామించిన ఫలితం ఇది. నరకుని రాజధాని ప్రాగ్జోతిషపురం. ఇతడు దేవమాతయైన అదితి కుండలాలను, వరుణదేవుని ఛత్రాన్ని, దేవతల మణి పర్వతాన్ని, 16 వేల మంది గోపికలను చెరపట్టి అపహరించాడు. దీంతో గత్యంతరం లేని దేవేంవూదుడు శ్రీ కృష్ణునికి నరకాసురుని అత్యాచారాలు విన్నవిస్తాడు.
శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై నరకాసురుని పైకి యుద్ధానికి వెళ్ళి, అతనిని సంహరించాడు. 16 వేల మంది గోపికలకు దాస్య విమోచనం కలిగించిండు. దేవేంవూదుని నగరమైన అమరావతికి వెళ్ళి అదితికి కుండలాలను సమర్పిస్తాడు. సత్యభామా సమేతంగా ఆమె ఆశీస్సులు అందుకుంటడు.
లోకకంటకుడైన నరకాసురుడు మరణించిన ఆ రోజు శ్రీకృష్ణుని విజయానికి గుర్తుగా భూలోకంలోని ప్రజలు సంతోషంగా జరుపుకునే పండగగా ‘నరక చతుర్దశి’ స్థిరపడింది.


ఈ చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని, అభ్యంగన స్నానం చేయాలి. ప్రత్యేకించి ఆ వేళ నువ్వులనూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు వివరిస్తున్నవి. యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు.
అభ్యంగన స్నానానంతరం దక్షణాభి ముఖంగా ‘యమాయమంః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు తినడంతోపాటు సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తరు. ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దానధర్మాలు చేస్తరో వారి పితృదేవతలకు నరకబాధ తొలగుతుందని భారతీయుల నమ్మకం.
 
దీపావళి- ధనలక్ష్మి పూజ, కేదారేశ్వర వ్రతం
  • నరక చతుర్దశి తర్వాతి రోజు దీపావళి అమావాస్య. ఇది ఆశ్వయుజ మాసపు చిట్టచివరి రోజు. ఈ రోజు తప్పకుండా లక్ష్మీదేవిని పూజించాలి. ఎందుకంటే చీకటిపై వెలుతురు సాధించిన విజయానికి గుర్తుగా మనం దీపావళిని జరుపుకుంటున్నం. కొన్ని ప్రాంతాలలో పగలంతా ఉపవాసముండి, సాయంత్రం లక్ష్మీదేవిని పూజించే ఆచారం వుంది.
  • దీపావళి రోజు సాయంత్రం కొత్త బట్టలు ధరించి తప్పకుండా ధనలక్ష్మిని పూజించాలి. ఈ రోజు మహాలక్ష్మిదేవి భూలోకానికి వస్తుందంటారు. ప్రతీ ఇంటికి వెళ్తూ, శుభ్రంగా అలికి ముగ్గులు వేసిన ఇండ్ల ముందు తన కళను వదిలి వెళ్తుందని ప్రజల నమ్మకం. ఉత్తర భారత దేశంలో ధనలక్ష్మీ పూజ ఈ అశ్వయుజ అమావాస్య చాలా ప్రశస్తమయిందిగా భావిస్తరు.
  • ఈరోజు వ్యాపారులు లాభనష్టాలను పరిశీలిస్తరు. లక్ష్మీపూజ కోసం తప్పకుండా వారి వారి శక్తి మేరకు బంగారం, వెండి కొంటరు. తెలంగాణ ప్రాంతంలో వ్యాపారులు ఆనాటి సాయంత్రం ధనలక్ష్మిని భక్తితో పూజించి, తమ వ్యాపారం దినదిన ప్రవర్దమానం కావాలని కోరుకుంటరు.
  • లక్ష్మీ పూజానంతరం కుటుంబ సభ్యులందరూ మధురమైన తీపి పదార్ధాలను ఇతరులకు పంచి పెడతారు. టపాకాయలు కాలుస్తారు .
  • ముఖ్యంగా పల్లె ప్రాంతాలలో దీపావళిని ‘దివిలి పండగ’ అంటరు. పసుల పిల్లలు గోగు (పుట్టి) కట్టెలతో కట్టలను కట్టి రాత్రి సమయంలో వెలిగించి తిప్పుతరు. దీనివల్ల ఆపదలన్నీ తొలగిపోయి, సుఖ సంతోషాలు కలుగుతవని వారి నమ్మకం.
  • తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో ఈ రోజు నుండే కేదారేశ్వర వ్రతం ప్రారంభిస్తారు. మంగళ ప్రదాయిని అయిన ఈ గౌరీదేవి వ్రతం చేస్తే సమస్త శుభాలు కలుగుతాయని ప్రజల విశ్వాసం. అయితే, ఈ గౌరీ నోములను కొందరు కార్తీకమాసంలో దశమి నోములుగానూ నోముకుంటరు.
  • అజ్ఞానమనే అమావాస్య చీకట్లను పారవూదోలి విజ్ఞానమనే వెలుగులను నింపి, జగత్తును తేజోమయం చేసే పండగ దీపావళి. దరివూదానికి అధిదేవతయైన జేష్ఠ్యాదేవిని పారదోలి సంపదల తల్లియైన లక్ష్మీదేవికి స్వాగతం పలికే పండగగానూ దీనిని భావించాలి.
 

Comments

Popular Posts