ఇచ్చట పెళ్ళికొడుకులు అమ్మబడునునగరం లొ ఈ మధ్య ఒక కొత్త మాల్ (mall) తెరిచారు. ఇచ్చట పెళ్ళి కొడుకులు కూడా అమ్మబడును అని ప్రకటనలు ఇచ్చారు (అవును సరిగ్గా పెళ్ళైన కొత్త...లో సినిమాలో లాగానే). కాకపోతే కొన్ని షరతులు పెట్టారు, అవి ఏమిటంటే:
అమ్మాయిలు మా మాల్ కి ఒక్కసారి మాత్రమే అనుమతింప బడుతారు
పెళ్ళి కొడుకులని వారి వారి హోదా, రుచులు, అభిరుచులకు తగ్గట్లు వివిధ అంతస్థులలో వర్గీకరించబడ్డారు. ఏ అంతస్థులో పెళ్ళి కొడుకునైనా మీరు ఎన్నుకోవచ్చును. ఆ అంతస్థులో నచ్చకపోతే మీరు మరో అంతస్థుకి వెళ్ళవచ్చు. కాకపోతే మీరు వెనక్కి తిరిగి రావటానికి అస్కారము లేదు, చివరి అంతస్థు నుంచి బయటకు పోవడం తప్ప.
ఇదేదో బావుందే చూద్దామని ఒక అమ్మాయి మాల్ కి వస్తుంది. అంతస్థులవారీగా ఈ విధంగా సూచనలు ఉన్నాయి.
మెదటి అంతస్థు: ఈ పెళ్ళి కొడుకులకు ఉద్యోగాలు ఉన్నాయి. భార్యను బాగా చూసుకుంటారు.
రెండవ అంతస్థు: ఈ పెళ్ళి కొడుకులకు ఉద్యోగాలు ఉన్నాయి. భార్యను బాగా చూసుకుంటారు , పిల్లలను ప్రేమిస్తారు.
మూడవ అంతస్థు: ఈ పెళ్ళి కొడుకులకు ఉద్యోగాలు ఉన్నాయి. భార్యను బాగా చూసుకుంటారు , పిల్లలను ప్రేమిస్తారు. మరియు వీళ్ళు చాలా అందగాళ్ళు.
అద్భుతం!! అని అనుకుంటూ ఇంకా పైకి వెళ్తే ఎలా ఉంటుందో అనుకుంటూ వెళ్ళింది ఆ అమ్మాయి.
నాలుగవ అంతస్థు: ఈ పెళ్ళి కొడుకులకు ఉద్యోగాలు ఉన్నాయి. భార్యను బాగా చూసుకుంటారు , పిల్లలను ప్రేమిస్తారు. మరియు వీళ్ళు చాలా అందగాళ్ళు. ఇంటి పని, వంట పనిలో కూడా సహాయ పడతారు.
"ఆహా !! ఈ మాల్ చాలా బావుందే. ఈ అంతస్థులో నాకు కావలసిన వరుడు దొరుకుతాడు అని అనుకున్నది. అలా అనుకున్న మరు క్షణమే ఇంకా పైకి వెళ్తే ఎలాంటి వాళ్ళు ఉంటారబ్బా!! అని అనుకొని తరువాతి అంతస్థుకి వెళ్తుంది".
అక్కడి సూచన ఇది:
"మీతో కలిపి ఈ అంతస్థుకి చేరుకున్నవారి సంఖ్య: 61,397. ఈ అంతస్థులో పెళ్ళికొడుకులు లేరు. ఆడవాళ్ళని మెప్పించడం అసాధ్యం.
-శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి

Comments

Popular Posts