ఈ మూడు సందర్భాలలో ఈ పనులు చేయరాదు ...

ఈ మూడు సమయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు:
1. ఆకలి నిన్ను చంపుతున్నపుడు,
2. నిద్ర మత్తులో ఉన్నపుడు,
3. మద్యం సేవించినపుడు.


ఈ మూడు సమయాల్లో ఎవరికీ వాగ్దానం చేయకూడదు:
1.బాగా సంతోషంగా ఉన్నపుడు,
2.బాగా దుఃఖంలో ఉన్నపుడు,
3.బాగా కోపంలో ఉన్నపుడు.


అలాగే ఈ ముగ్గురుని ఎప్పటికీ మరవకూడదు:
1.ఆపదలో మనల్ని ఆదుకున్న వారిని,
2మనలో లోపాల్ని బూతద్దంలో చూడని వారిని,
3.మన మంచిని సదా కోరే వారిని.


ఈ ముగ్గురుని దరికి రానివ్వకండి:
1.మనకు విలువ నివ్వని వారిని,
2.మనల్ని చూసి ఈర్ష పడేవారిని,
3.మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారికి.

Comments

Popular Posts