కోతులు ౼ సూచీముఖం కథ

కొంతకాలం క్రితం ఒక చెట్టుమీద "సూచీముఖం" అనే చిన్న పక్షి ఒకటి నివసిస్తూ ఉండేది.అది చాలా తెలివైనది కూడా.ఆ సమీపంలోని చెట్లమీద కొన్ని కోతులు నివసిస్తున్నాయి.చలికాలం వచ్చింది.ఒకరోజు చలి ఎక్కువగా వీచసాగింది.చలికి తట్టుకోలేక కోతులు "చలిమంట వేసుకోవా"లనుకున్నాయి.అవి కొన్ని మిణుగురుపురుగులను చూచి "నిప్పు" అనుకొని వాటి చుట్టూ కూర్చొని చలికాచుకోసాగాయి.
"సూచీముఖము ఆ కోతుల తెలివి తక్కువకు లోలోన నవ్వుకొని "మిత్రులారా!అవి మిణుగురు పురుగులు కానీ నిప్పురవ్వలు కాదు.వాటివల్ల... మీ చలి తీరదు.అదుగో!ఆ చెట్టు వద్ద నిప్పు ఉన్నది.అచటికి వెళ్ళి చలికాచుకోండి"అని చెప్పింది. ఆ మాటలు విన్న కోతులకు కోపం వచ్చింది."నోరుమూసుకో చూడబోతే చిటికెడు లేవు.నీవు మాకు నీతులు చెప్పేదానవా?నీకున్నపాటి బుద్ధి మాకు లేదనుకున్నావా?నీకింత పొగరా?" అని ఆ కోతులు దాని మెడ పట్టుకొని పిసికి చంపివేశాయి.కనుక మూర్ఖులకు హితము చెప్పరాదు, చెప్పినను బద్ధిహీనులు వారి మాటలు వినక తమకే హాని తల పెడతారు.అలాంటి వారికి సహాయము చేయబోయి చివరకు వారే చెడిపోతారు.

Comments

Popular Posts