ఒక జంట -ఒక బ్యాంకు అకౌంట్ (చక్కటి చిన్న కథ)

పెళ్ళి కార్యక్రమం పూర్తయింది...పెళ్ళికూతురు తల్లి తన కుమార్తె కు కొత్తగా ఎక్కౌంట్ ఓపెన్ చేసి రూ.10,000 డిపాజిట్ చేసి పాస్ బుక్ చేతికి ఇచ్చి ఇలా చెప్తుంది....

చూడమ్మా!మీ వైవాహిక జీవితంలో సంతోషకరమైన విషయాలు అన్నీ దీనిలో రాసుకుని భద్రపరుచుకో...అలాగే ప్రతి సంతోషకరమైన సందర్భంలో ఈ ఎక్కౌంట్ లో డబ్బులు డిపాజిట్ చేసుకో...నీ భర్తను కూడా డిపాజిట్ చేయమను. ఇలా చేయటం వల్ల కొన్ని సం. తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే...మీరు ఎంత ఆనందాన్ని పంచుకుంది అర్ధమవుతుంది...
...
భార్యా భర్తలకు ఈ అయిడియా బాగా నచ్చింది..
సరేనమ్మా...అలాగే చేస్తాం...
ఆ రోజునుంచి ఇద్దరూ సంతోషాన్ని ఆ పాస్ బుక్ లో రాయడం మొదలు పెట్టారు...
15 March...Rs.5,000..Her First birthday after marriage
23 March..Rs.3,000...Vacation celebration
5th April..Rs.10,000 Her pregnancy...
8 May. .Rs.50,000 His promotion...
ఇలా కొన్ని రోజులు గడిచాయి...మెల్లగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి...వాదనలు మొదలయ్యాయి... ఇద్దరి మధ్య మాటలు కరువయ్యాయి...ఇద్దరి మధ్య ప్రేమ లేకుండా జీవించటం కష్టమని విడాకులు తీసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నారు...
అదే విషయం పెళ్ళి కూతురు తన తల్లికి చెప్తుంది...జీవితంలో ఇంత భాధ్యతలేని వ్యక్తిని పెళ్ళి చేసుకుని తప్పు చేసానని వాపోతుంది...
ఇదంతా విన్న తల్లి... సరే ఐతే మీ జీవితం మీద మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది....దీనికి ముందు నీ ఎక్కౌంట్ లో ఉన్న సొమ్ము మొత్తం ఖర్చుపెట్టు...ఎందుకంటే నీ పాస్ బుక్ లో పాత జ్ఞాపకాలు ఉండకూడదు కదా..!
సరే అని ఉదయాన్నే ఎక్కౌంట్ క్లోజ్ చేయటానికి బ్యాంక్ కు వెళ్ళింది... అక్కడ చాలా పెద్ద క్యూ ఉంది... ఈ టైమ్ లో పాస్ బుక్ ఓపెన్ చేసి చూసింది...ఒక నిమిషం ,రెండు నిమిషాలు, మూడు, నాలుగు అలా చూస్తూనే ఉండిపోయింది. ఆనందంగా గడిచిన క్షణాలన్నీ మదిలో కదలాడాయ్... కళ్ళలో నీళ్ళు తిరిగాయి...అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయింది...ఇంటికెళ్ళి మౌనంగా పాస్ బుక్ తన భర్తకు ఇచ్చి ఎక్కౌంట్ క్లోజ్ చేయమని చెప్తుంది..
భర్త బ్యాంకు కు వెళ్ళాడు...సేమ్ క్యూ...పాస్ బుక్ ఓపెన్ చేసాడు అలాగే చూస్తుండి పోయాడు.... ఇంటికి వచ్చేసాడు...బుక్ ని భార్య కు ఇచ్చాడు..
భార్య ఓపెన్ చేసి చూసింది... అందులో..Rs.50,000 కొత్తగా డిపాజిట్ చేసి ఇలా రాసి ఉంది-
"ఈ రోజు చాలా మంచిరోజు ఇంత గొప్ప భార్యను నేను అర్దం చేసుకోలేక పోయినందుకు పశ్చాత్తాపం చెందా...నా భార్యను క్షమాపణ కోరుకుంటున్నా.."
అంతే భార్య తన భర్తను చుట్టేసుకుని ఏడ్చేసింది....

-FB Post
 

Comments

Popular Posts