ఈ ఆహార పదార్థాలను వీటితో కలిపి తింటే ఆరోగ్యం చెడిపోతుందట..(ఒక్కో సారి ప్రాణం మీదకు వచ్ఛే ప్రమాదం ఉండవచ్చునట!)

ఆయుర్వేదం ప్రకారం కొన్ని ఆహార పదార్ధాలని కొన్నింటితో పాటు కలిపి తీసుకుంటే రోగాలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు .(ఒక్కో సారి ప్రాణం మీదకు వచ్ఛే ప్రమాదం ఉండవచ్చునట!)


వ్యతిరేక ఆహారం అనేక రకాలుగా ఉంటుంది. ఉదాహరణలు:
పాలతో-పెరుగు,ఉప్పు,ముల్లంగి,పచ్చిసలాడ్,చింతపండు,పుచ్చకాయ,కొబ్బరి,నిమ్మకాయ,సీతాఫలం,వగరుపండ్లు,దానిమ్మ,ఉసిరికాయ,దబ్బపండు,బీరకాయ,బెల్లం,మినుములు,రాజ్మ,చమురు,వివిధ రకాల పుల్లటి పండ్లు, చేపలు మొదలైన రకాలు ఆరోగ్యానికి మంచిదికాదు.

పెరుగుతో-
పాయసం(ఖీర్),పాలు,ఛీజ్,పన్నీరు,వేడిపదార్థాలు,దోసకాయలు,ఖీరా,కర్బూజాలు వ్యతిరేకమైనవి.
పాయసం(ఖీర్)తో---పనసకాయ,పుల్లటి పదార్ధాలు(పెరుగు,నిమ్మకాయ,) మద్యం మొదలగునవి  హానికరం.తేనెతో-బెల్లడోనా,నెయ్యి (సమాన నిష్పత్తిలో పాత నెయ్యి),వర్షపు నీరు,నూనె,కొవ్వు, ద్రాక్ష, తామరపువ్వు విత్తనాలు,ముల్లంగి,వేడినీరు,వేడిపాలు లేదా ఇతర వేడి పదార్ధాలు, చక్కెర, చక్కెరతో పాకంతో చేసిన షర్బత్  హానికరం. తేనెను వేడిచేసి తీసుకోవడం నిషిద్ధం. 

చల్లని నీటితో-
నెయ్యి,నూనె,వేడిపాలు లేదా వేడి పదార్ధాలు, పుచ్చకాయ,జామకాయ,దోసకాయ,వేరుశనగపప్పు హానికరం.

వేడి నీరు లేదా వెచ్చని పానీయాలతో- తేనె, ఐస్ క్రీమ్ లు,ఇతర చల్లటి పదార్థాలు తీసుకోరాదు. 


నెయ్యి తో-సమాన నిష్పత్తిలో తేనె, చల్లని నీటితో తీసుకోవడం మంచిదికాదు. 


కస్తూరి పుచ్చకాయ (కర్బూజా)తో-వెల్లుల్లి, పెరుగు, పాలు, ముల్లంగి ఆకులు, నీరు  తీసుకోవడం హితకరం కాదు.


పుచ్చకాయతో - చల్లటి నీరు మరియి పుదీన తీసుకోవడం హితకరం కాదు. 


బియ్యం తో-వెనిగరు హానికరం. 


మినప్పప్పుతో - ముల్లంగి తినడం హానికరం.


అరటిపండుతో - మజ్జిగను వాడడం హానికరం.


నెయ్యి కంచు పాత్రలో 10 రోజుల పాటు వరుసగా ఉంచితే విషపూరితమవుతుంది. 


పాలు,మద్యం, కిచిడి -- ఈ మూడింటిని కలిపి భుజిస్తే ఆరోగ్యానికి హానికరం.


వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సరైన ఆహారం మాత్రమే తీసుకోవాలి.

Comments

Popular Posts