ఎన్నో దేవతా స్తోత్రాలున్నాయి. ప్రతిదీ నిత్యం పారాయణ చేయాలని చెప్తారు. కానీ రోజూ అన్ని పారాయణ చేయడం సాధ్యం కావడం లేదు. మరి వాటిని నిత్యపారాయణ చేయకపోవడం పాపం కదా? పైగా ఇన్నిన్ని స్తోత్రాలు ఎందుకు?

అన్ని స్తోత్రాలు పారాయణ చేయడం నిత్యమూ సాధ్యం కాదు. అలాగని అవి ఎందుకు? అని ప్రశ్నించరాదు. బజారులో బోలెడన్ని కూరగాయలుంటాయి. అన్నీ రోజూ తినలేం. అలాగని ఇన్నిన్ని ఎందుకు? అంటామా?

ఎవరి అవకాశం, అభీష్టం బట్టి నిత్యం సాధ్యమైన వాటినే అనుష్ఠించవచ్చు. రోజూ విందుభోజనం చేయలేం కదా! ఏ పండగకో పబ్బానికో విందునారగించినట్లు తీరిక దొరికిన వేళ సావకాశంగా స్తోత్రాలు పారాయణ చేసుకోవచ్చు. ఏదేమైనా – ఆనందంగా భక్తిగా వాటిని పఠించాలే తప్ప, తప్పనిసరి కృత్యంగా మొక్కుబడి వ్యవహారంగా తలచరాదు.
నిత్యం మన అవకాశం బట్ి ఆహారం తిన్నట్లే, స్తోత్రమో, జపమో పరిమితమైన అనుష్ఠానం అవసరం. ఆయా దేవతలకి నిర్దేశించిన వారాలలో, తిథులలో, పర్వదినాలలో ఆయా స్తోత్రాలను నిదానంగా పఠించుకోవచ్చు.
ఔషధశాలలో మందుల వలె వివిధ ప్రయోజనాలకోసం, వివిధ స్తోత్రాలుంటాయి. కొన్ని ఆరోగ్యం కోసం, కొన్ని దారిద్ర్య నివారణ కోసం…ఇలా! వాటిని ఆయా లక్ష్యాల సిద్ధికోసం వినియోగించుకోవచ్చు.

Comments

Popular Posts