పక్షము అంటే ఏమిటి? పక్షంలోని తిథులు - వాటి అధి దేవతలు


 
పక్షము అనగా 15 రోజులకు (లేదా కచ్చితంగా 14 రాత్రులకు) సమానమైన ఒక కాలమానము. ప్రతి నెలలో రెండు పక్షాలుంటాయి:
1.శుక్ల పక్షం (అమావాస్య నుంచి పున్నమి వరకు) : రోజు రోజుకూ చంద్రుడితో బాటే వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెల్లని అని అర్థం).
2.కృష్ణ పక్షం (పున్నమి నుంచి అమావాస్య వరకు) : రోజు రోజుకూ చంద్రుడితో బాటే వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నల్లని అని అర్థం).
 
తిథి:
వేద సమయానుసారము ఒక చాంద్రమాన రోజును తిథి అంటారు లేదా శాస్త్రీయముగా సూర్యుడు మరియు చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు. తిధులు రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉంది. ఒక్కొక్క తిథి దాదాపు 19 నుండి 26 గంటల సమయము ఉంటుంది. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి.
 
పక్షంలోని తిథులు-అధి దేవతలు:
పాడ్యమి (అధి దేవత - అగ్ని)
విదియ (అధి దేవత - బ్రహ్మ)
తదియ (అధి దేవత - గౌరి)
చవితి (అధి దేవత - వినాయకుడు)
పంచమి (అధి దేవత - సర్పము)
షష్ఠి (అధి దేవత - కుమార స్వామి)
సప్తమి (అధి దేవత - సూర్యుడు)
అష్టమి (అధి దేవత - శివుడు)
నవమి (అధి దేవత - దుర్గా దేవి)
దశమి (అధి దేవత - యముడు)
ఏకాదశి (అధి దేవత - శివుడు)
ద్వాదశి (అధి దేవత - విష్ణువు)
త్రయోదశి (అధి దేవత - మన్మధుడు)
చతుర్దశి (అధి దేవత - శివుడు)
పున్నమి/పూర్ణిమ/పౌర్ణమి మరియు అమావాస్య (అధి దేవత - చంద్రుడు)
 

Comments

Popular Posts