శ్రీవిద్య


విద్య అనగా జ్ఞానము. ప్రత్యేకించి తంత్రము లో స్త్రీ (శక్తి) కి సంబంధించిన జ్ఞానము. శ్రీ విద్య అనగా లలితా దేవి లేదా త్రిపుర సుందరికి సంబంధించిన జ్ఞానము అని అర్థం.


శ్రీవిద్య ఒక హిందువుల దేవత. ఈమెను త్రిపురసుందరి (మూడు నగరాల అందమైన దేవత') అని కూడా పిలుస్తారు. బ్రిటిష్ పరిశోధకుడు గావిన్ ఫ్లడ్ ప్రకారం ఆమె ఒక తాంత్రికమైన దేవత రూపంలోవున్న శ్రీ అనగా లక్ష్మి విష్ణువు యొక్క సహవాసి అని భావించారు. సాంఖ్యశాస్త్ర పండితులైన చంద్రశేఖ సరస్వతి స్వామి శ్రీవిద్యను శివుని భార్య పార్వతి లేదా దుర్గగా తలచారు. వీరి ప్రకారం శ్రీ అనగా శుభప్రధమైనది అని అర్ధాన్ని ఇస్తుంది. లలితా సహస్రనామ స్తోత్రంలో లలితాదేవి కీర్తించబడింది.

శ్రీ చక్రం లేదా మేరు చక్రాలను ఈ దేవత ఆరాధన లో  పూజిస్తారు. అమ్మవారిని శక్తివంతమైన శ్రీచక్రం యొక్క, రూపంగా తలుస్తారు. శ్రీ చక్రం సాధారణం గా వెండి, యాంటిమోనీ, రాగి, జింక్, సాంప్రదాయిక పంచలోహాలతో చేయబడి, బంగారుపూతతో కప్పబడి ఉంటుంది.మూడు డైమెన్షనల్(Three dimensional/3D) కలిగిన మేరు చక్రాలను రాక్ క్రిస్టల్ మరియు మెటల్ లోనూ చూడవచ్చు,
శ్రీవిద్య పేరును పదిహేను అక్షరాలను కలిగిన మంత్రం పంచదశాక్షరీ మంత్రంగా పూజిస్తారు. అయితే మరికొంతమంది వీనికి "శ్రీ"ని కలిపి శోడషాక్షరీ మంత్రంగా కూడా భావిస్తారు.

Comments

Popular Posts