కౌమార దశలోకి అడుగిడుతోన్న ఆడపిల్లల తల్లిదండ్రులకి ఒక మనవి!ఒక వయసుకి వచ్చాక ఆమె శరీరంలో కొన్ని హార్మోనులు విడుదల కావడం వలన మెన్స్ట్రువల్ సైకిల్ అంటే పునరుత్పత్తికి సంబంధించిన అవయవాల పని ప్రారంభం అవుతుంది. ఈప్రక్రియలో భాగంగా మొదటిసారిగా బీజకోశం నుండి వెలువడిన మొదటి అండం తన సమయం దాటిపోయాక గర్భాశయ గోడలను వదిలి బయటకు పోతుంది. ఆ సమయంలో కొంత రక్తము కూడా పోతుంది. దీనినే స్థానిక భాషలో పెద్దమనిషి ఆవడం అంటారు.

ఈ మధ్య ఈ పెద్దమనిషి అవడం అనేది నిజంగా నిజం కాక పోవడం కూడా జరుగుతుంది. చిన్న పిల్లల్లో కూడా ఈ ప్రక్రియ త్వరగా ప్రారంభం కావడం అనేది మనము వారికి పెట్టే ఆహారము వలన జరుగుతుంది. పిజ్జాలు, బర్గర్లు, హార్మోను ఇంజక్షనులు ఇచ్చిన చికెన్, ఇతర జంక్ ఫుడ్ లోని కొవ్వు పదార్ధాలు, సరయిన వ్యాయామం లేకపోవడం వలన, కొంత వంశపారంపర్యంగా కూడా రావచ్చును.

1. ఇది ప్రకృతి సిద్ధంగా జరిగే ఒక ప్రక్రియ మాత్రమే మాత్రమే.
2. ఆమాత్రందానికి, "మా అమ్మాయి పెద్ద్ద మనిషయ్యింది" ....అని అందరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ...ఒక విధంగా ఆలా చేయడం దారుణం ..తప్పు కూడా!
3. పూర్వకాలంలో అంటే పేపర్లు, రేడియోలు, టీవీలు, ఫోన్ సౌకర్యాలు అందుబాటులో లేని రోజుల్లో, బాల్య వివాహాలు జరిగే రోజుల్లో "మా ఇంట్లో పెద్దమనిషైన పిల్ల ఉంది....ఆమెకు తగిన వరుడునిచ్చి పెళ్లి చేయాలి" అనే ఉద్దేశ్యంతో ఫంక్షన్ పెట్టేవారు. ఆరోజుల్లో అలా అందరికీ తెలిసేలా కార్యక్రమం చేయడం అవసరం.
4. ఈ రోజుల్లో అలా చేయడం చాలా తప్పు కాక పోవచ్చు కానీ ఇది అనవసరం. తప్పదు అనుకుంటే దగ్గరి చుట్టాలకు చెప్పండి చాలు. బ్యానర్ లు పెట్టి, సినిమా షూటింగ్ లా చేయనవసరంలేదు.చిన్న వయసులోనే పెద్దమనిషి అవడం అనేది ఆ బిడ్డకు చాలా అసౌకర్యం.ఇలా ఫంక్షన్ చేయడం వలన, అనవసర ప్రాధాన్యత ఇచ్చి ఆమెకు లేని ఆలోచనలు, ఆందోళనలు  కల్పించడమే అవుతుంది.
5.తల్లిదండ్రులుగా మనం చేయాల్సింది ముందుగా గైనకాలజిస్ట్ దగ్గర చూపించి ఆమె శారీరక స్థితి, ఆరోగ్యవిషయం సరిగా వుందా లేదా అని తెలుసుకోవాలి. అవసరమైతే పాపకు కౌన్సెలింగ్ ఇప్పించి ఆమె శరీరంలో ఏమి జరుగుతుందనేది ఎంతవరకు చెప్పాలో అంతా చెప్పించాలి..చిన్నపిల్లల సైకాలాజిస్ట్ తో కూడా మాట్లాడించడం మంచిది..
6. ఫంక్షన్ చేసి డబ్బులు పాడుచేసేబదులు వాళ్ళ పేరున ఒక ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తే ఆమె భవిష్యత్ కి ఉపయోగపడుతుంది.
7. అనాగరికమైన పద్ధతులు పిల్లలపై ప్రయోగించకండి. అంటే, కప్పులకొద్దీ నూనె తాగించడం, వద్దంటున్నా నోట్లో బెల్లం కుక్కేయడం, ఆకులమీద,  చాపలమీద రోజులతరబడి కూర్చోబెట్టడం,మరీ ముఖ్యంగా రోజుల తరబడి స్నానం చేయించకపోవడం, ఒంటరిగా గదిలో పెట్టి ఉంచడం లాంటి పనుల వలన పిల్లలలో ఒకరకమయిన భయాన్ని , అయోమయాన్ని, అభద్రతా భావాన్ని కలగజేసిన వారం అవుతాము.
8.ఇలాంటి 'అతి' చర్యలవలన పిల్లలు తమకేదో జరగరానిది జరిగిందని, తాము ఏదో తప్పు చేసినట్లు భావించే అవకాశం ఉంది.
9.అమ్మాయికి ప్యుబర్టీ దశకు చేరుతున్నపుడే వారి శరీరంపై వారికి అవగాహన కలిగేలా చెప్పడం మంచి పద్ధతి. మనకు అంత పరిజ్ఞానం లేనపుడు డాక్టరు ద్వారానో, చైల్డ్ సైకాలజిస్ట్ ద్వారానో చెప్పించాలి. ముందు తల్లిదండ్రులకు తెలిస్తే పిల్లలకు వివరించగలుగుతారు.

 "ఆధునిక యుగంలో వుంటూ అనాగరికుల్లా ప్రవర్తించడం ఏంబాగుంటుంది ఆలోచించండి."


Courtesy-P.Sunil

Comments

Popular Posts