గాయత్రి మంత్రంలోని బీజాక్షరాల పరమార్ధంఓమ్ భూర్భువఃస్సువః !
తత్సవితుర్వ రేణ్యం !
భర్గో దేవస్య ధీమహి !
దియో యోనః ప్రచోదయాత్ !!

" 'గ' త్రాయతే ఇతి గాయత్రి " ప్రాణాలను రక్షించేది, ప్రాణశక్తిని ఇచ్చేది గాయత్రి!!
"సప్త కోటి మంత్రాలకు మూలం "గాయత్రి" !!

గాయత్రి మంత్రంలో 24 బీజాక్షరాలు, 24 అధిష్టాన దేవతలు 24 తత్వాలు వున్నాయి.
ఉపనయనం అయి గాయత్రి ధారణ జరిగిన వారు గాయత్రి ఉపాసన చేయాలి. గాయత్రి మంత్ర జపం తప్పకుండా చేయగలరని ఆశిస్తూ కొన్ని విశేషాలు తెలుసుకుందాము !

1 'త' బీజాక్షరం - గణేశుడు - సర్వ విఘ్న నాశకుడు సిద్ధి, బుద్ధి ప్రసాదిస్తాడు!!
2 'త్స' బీజాక్షరం - లక్ష్మి నరసింహుడు - ఉప పాతకములు సర్వ దోషాలు నశిస్తాయి. శత్రు విజయం కలుగుతుంది!!
3 'వి' బీజాక్షరం - మహా విష్ణువు - స్థితి శక్తి లభించి పాలన దక్షత వ్యవహారాల నైపుణ్యం యాజమాన్యశక్తులు లభిస్తాయ!!
4 'తు' బీజాక్షరం - పరమ శివుడు - సర్వ దుష్ట గ్రహ బాధల నశించి సర్వ మంగళములు చేకూరుతాయి!!
5 'ర్వ' బీజాక్షరం - శ్రీ కృష్ణుడు - గోహత్యాది మహా పాతకాలు నశించి యోగ సిద్ధి, జ్ఞాన సిద్ధి కలుగుతుంది!!
6 'రే' బీజాక్షరం - రాధా దేవి - అసూయ ద్వేషాలు నశించి పరమ ప్రేమ ఆధ్యాత్మిక దివ్యానుభూతి కలుగుతుంది!!
7 'ణ్య' బీజాక్షరం - మహా లక్ష్మి - దారిద్య్ర బాధలు తొలగి అష్ట ఐశ్వర్యాలతో పాటు జ్ఞాన ఐశ్వర్యం కూడ లభిస్తుంది!!
8 'యం' బీజాక్షరం - అగ్ని దేవుడు - బ్రహ్మ హత్యాది మహా పాతకాలు నశించి అగ్ని పునీతులవుతారు!!
9 'భ' బీజాక్షరం - ఇంద్రుడు - చోరత్వ, హింస, ఆక్రమణ దోషాలు నశించి ఆత్మ తేజస్సు కలుగుతుంది!!
10 'ర్గో' బీజాక్షరం - మహాసరస్వతీ - సర్వ పాతకాలు నశించి సరస విచార వివేకము బ్రహ్మజ్ఞాన సిద్ధి కలుగుతుంది!!
11 'దే' బీజాక్షరం - దుర్గాదేవి - అంతః బహి శత్రువులు నశించి దుర్గతులు పోయి సర్వ శక్తులు లభిస్థాయి!!
12 'వ' బీజాక్షరం - హనుమంతుడు - సర్వ కార్యసిద్ధి, దైవ భక్తి బుద్ధి బలం నిష్ఠ కర్తవ్య పరాయణత్వం కలుగుతుంది!!
13 'స్య' బీజాక్షరం - భూమాత - క్షమ ఓర్పు సహనం ఆత్మనిష్ఠ ధైర్యం భూ సంభంధ దోషాలు పోతాయి!!
14'ధీ' బీజాక్షరం- సూర్యుడు- మాతృ పితృ హింసా దోషాలు నశించి సంపూర్ణ ఆరోగ్యం అపూర్వ దివ్యతేజస్ లభిస్తుంది!!
15 'మ' బీజాక్షరం- శ్రీరాముడు- అనంత మహా పాతకాలు నశించి మర్యాద వినయం మైత్రి ధర్మం లభిస్తాయి!!
16 'హి' బీజాక్షరం- సీతామహాదేవి -అశేష పాపరాశి నశించి సర్వ తపోశక్తి ధర్మశక్తి జ్ఞాన శక్తులు లభిస్తాయి!!
17 'ధి' బీజాక్షరం- చంద్రుడు- శోక మోహాలు ఆశ నిరాశలు నశించి అమృతత్వం పరమ మానసిక శాంతి కలుగుతుంది!!
18 'యో' బీజాక్షరం- యముడు- కాలాన్ని సద్వినియోగం చేయగలుగుతాం విజ్ఞానం వివేకం సద్వర్తనం కలిగి మృత్యుదోష నివారణ అవుతుంది!!
19 'యో' బీజాక్షరం- బ్రహ్మదేవుడు- సర్వ పాతకాలు నశించి చేతనాశక్తి సృజనాత్మక శక్తి బ్రహ్మ జ్ఞానం లభిస్తుంది!!
20 'నః' బీజాక్షరం- వరుణదేవుడు- ఈశ్వరానుగ్రహం విష్ణు అను గ్రహంతో మోక్ష ప్రాప్తి కలుగుతుంది!!
21 'ప్ర' బీజాక్షరం-నారాయణుడు- వైకుంఠలోక ప్రాప్తి మహాత్వపూరిత ఆధ్యాత్మకజీవనం శుద్ధ సత్వగుణం లభిస్తాయి!!
22 'చో' బీజాక్షరం- హయగ్రీవుడు- సర్వ విద్యలు సర్వశక్తులు లభించి చివరికి బ్రహ్మజ్ఞానం లభిస్తుంది!!
23 'ద' బీజాక్షరం- పరమహంస- హంసజ్ఞానం పరమపదము సవితజ్ఞత వివేకం ఆత్మవిచారం పరమ శాంతి కలుగుతుంది!!
24 'యాత్' బీజాక్షరం- తులసీమాత- వినయం సర్వభూతదయ సర్వ ప్రాణులలో దైవాన్ని చూసే స్థితి కలుగుతుంది!!
ఈ 24 బీజాక్షరాలు, 24 మంది దేవతలు అపూర్వ విశ్వశక్తుల సమగ్ర సమాహారమే
" గాయత్రి మహా మంత్రం "


-సామర్ల వేంకటేశ్వరాచార్య

Comments

Popular Posts