కార్తీకమాసంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా దీపాలు వెలిగిస్తే..


కార్తీకమాసం.. విష్ణువుతో సమానమైన దైవం, వేదంతో సమానమైన శాస్త్రం, గంగతో సమానమైన తీర్థం లేదని చెప్తారు. సూర్యుడు తులారాశిలోకి రాగానే కార్తీకమాసం ఆరంభమవుతుంది. ఈ పవిత్ర కార్తీకమాసంలో దీపావళికి విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. శివకేశవులకు కార్తీక మాసం ప్రీతిపాత్రమైనది.

కార్తీకమాసంలో ఆధ్యాత్మిక సాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ నెల మొత్తం తెల్లవారుజామున నదీతీరంలో గాని, చెరువులు, కొలనులు, బావుల వద్ద స్నానం చేయాలి.
స్నానానంతరం ఓం ప్రభాకరాయనమః, ఓం దివాకరాయనమః, ఓం ప్రభాకరాయమః, ఓం అచ్చుతాయనమః, ఓం నమో గోవిందాయనమః అనే నామాలను స్తుతిస్తూ సూర్యభగవానునికి ఆత్గ్యం పోయాలి. ఈ నెల మొత్తం ఇంటి ముందున్న ప్రధాన ద్వారానికి రెండువైపులా దీపాలను వెలిగించాలి. ఇలా చేస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయని, పుణ్యఫలం చేకూరుతుందని విశ్వాసం.

Comments

Popular Posts