.....అది మనలోనే ఉంది.


కాఫీ షాప్ లో అతడు ప్రొద్దున్న నుండి చాలా బిజీ గా పనిచేస్తున్నాడు. ఒక్క క్షణం కూడా ఖాళీ లేదు . కాఫీ, టీ లు కలుపుతున్నవాడు కలుపుతున్నట్టు ఉన్నాడు . నుంచుని నుంచుని కాళ్ళు నొప్పులు వస్తున్నాయి...
సాయంత్రం అయ్యేసరికి తలనొప్పి వస్తోంది. చాలా అలసిపోయాడు. సమయం గడిచే కొద్దీ తలనొప్పి ఎక్కువ అవుతోంది . భరించడం కష్టం అనుకున్నాడు. షాప్ కుర్రవాడికి అప్పచెప్పి తలనొప్పికి మాత్ర వేసుకుందాం అని మెడికల్ షాప్ కి వెళ్ళాడు. తలనొప్పి ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి అని ... చెప్పి మాత్ర అడిగాడు. మెడికల్ షాప్ అమ్మాయి మాత్ర ఇచ్చింది..
“ఓనర్ గారు ఎక్కడకి వెళ్ళారమా?” అడిగాడు..
“ తలనొప్పిగా ఉంది . అలా కాఫీ షాప్ కి వెళ్లి ఒక కాఫీ తాగి వస్తాను అని మీ షాప్ కే వచ్చారు ” అంది అమ్మాయి..
అతడికి నోట మాట రాలేదు. తలనొప్పికి నేను మాత్ర కోసం ఇక్కడకి వస్తే, ఆయన అదే తలనొప్పికి కాఫీ కోసం నా షాప్ కి వచ్చాడా??
మనలోనే ఉన్నదానిని బయట వెతకడం అంటే ఇదే కదూ!!


ప్రశాంతత కోసం ప్రపంచం అంతా వెతుకుతాము. ప్రశాంతత మనలోనే ఉంటుంది .అది ఒక మానసిక స్థితి. దేవుణ్ణి చూడడానికి బయట వెతుకుతాము. మన హృదయ అంతర్గతంలోకి మాత్రం చూడము.

Comments

Popular Posts