పెరుగుతున్న పిల్లలు శరీరంలో మార్పులు, జననేంద్రియాల గురించి తెలుసుకోవాలని , దానికి సంబంధించిన ప్రశ్నలు వేస్తే తల్లిదండ్రులుగా మీరు సమాధానం ఇస్తున్నారా? దాటేస్తున్నారా?


పెరుగుతున్న పిల్లల నుంచి ఎదురయ్యే కొన్ని సందేహాలు -తల్లిదండ్రుల చెప్పాల్సిన సమాధానాలు.


1. ఆ పిల్లలకు ఎందుకు అక్కడ విభిన్నంగా ఉంది: పెరుగుతున్న పిల్లల్లో జననేంద్రియాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు అడిగే ప్రశ్నలు పట్టించుకోకపోవడం వల్ల వారిలో ఆతురత మరింత పెరిగిపోతుంది. వారి మదిలో మెదిలే ప్రశ్నలకు సమాధానం కనుక్కోడానికి వేరే దారులను వెత్తుకుంటారు. కాబట్టి అటువంటి ప్రశ్నలు మీ పిల్లలు అడిగినప్పుడు, ఎప్పుడు గాని మీరు నిర్లక్ష్యం చేయకండి. అబ్బాయిలు, అమ్మాయిలు వేరు వేరుగా నిర్మించబడ్డారని అందుచేతనే అలా ఉంటారని చెప్పండి. అందులో భాగంగా ఆ జననాంగాల పేర్లు కూడా చెప్పండి. ఇలా చెప్పడంలో ఎటువంటి తప్పులేదని చిన్న పిల్లల మానసిక నిపుణులు చెబుతున్నారు.
2. ఆ వ్యక్తి ఎందుకు లావుగా ఉన్నాడు? బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు మీ పిల్లలు అనూహ్యంగా ఎవరినైనా విభిన్నంగా ఉన్న వ్యక్తులను చూపించి ఎందుకు వాళ్ళు అలా ఉన్నారు అనే వింత ప్రశ్నలు అడుగుతుంటారు. ఇది ఎక్కువగా మిమ్మల్ని ఆందోళనకు గురిచేయవచ్చు. ఈ ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారని, ఎవరికి వారు విభిన్నమని మీ పిల్లలకు చెప్పండి. వ్యక్తుల యొక్క పరిమాణం, ఆకారం, చర్మపు రంగు ఇలా అన్ని విషయాలు విభిన్నంగా ఉండటం సాధారణమే అని అందరికీ ఒకే రకంగా ఉండవు అని తెలియజెప్పండి. " వేరే వాళ్ళని వేలెత్తి చూపిస్తే వాళ్ళు బాధపడతారు, వాళ్ల భావాలు దెబ్బతింటాయి. కాబట్టి ఇతరులను ఎప్పుడూ వేలెత్తి చూపించకు, వారు లేని సమయంలో వాళ్ల గురించి నన్ను అడుగు చెబుతాను. అందువల్ల వాళ్ళు కూడా నొచ్చుకోరు " అని చెప్పండి.
3. నాకంటే నా తోబోట్టువుని ఎక్కువగా ప్రేమిస్తావా ? ఇష్టపడతావా మాములుగా ఇంట్లో ఉన్న తోబుట్టువులు తల్లిదండ్రుల దృష్టిని ఆకర్షించడానికి గొడవపడుతుంటారు. కాబట్టి, ఇద్దరిమధ్య ఎప్పుడూ పోలికలు తీసుకురాకండి. ఎందుకంటే అలా చేస్తే పరిస్థితి మరింత దిగజారిపోతోంది. ఒకరు ఎక్కువా కాదు, మరొకరు తక్కువా కాదు, ఇద్దరూ సమానమే అని వాళ్లకు తెలియజెప్పండి మరియు అలానే వ్యవహరించండి. " కొన్ని సార్లు ప్రేమని వ్యక్తపరిచే విధానం విభిన్న రకాలుగా ఉండొచ్చు. అంతమాత్రం చేత ప్రేమ తగ్గిపోయిందని అర్ధం కాదు. ఇద్దరినీ ఒకేలా ప్రేమిస్తాను, చూసుకుంటాను మరియు ఇష్టపడతాను " అని చెప్పండి.

Comments

Popular Posts