నాగదోషాలకు, సం తానలేమి, జ్ఞానవృద్ధికి, కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధనమే తరుణోపాయం.

సాక్షాత్తు పరమశివుని అనుగ్రహంతో జన్మించినవాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. గణపతి ఏ విధంగానైతే పార్వతి మాత అనుగ్రహంతో, లోక కళ్యాణంకోసం జన్మించాడో, కుమారస్వామి కూడా మహాశివుని అభీష్టంతో లోక కళ్యాణంకోసం ఉద్భవించాడు. మన పురాణాలలో చెప్పినట్టు సుబ్రహ్మణ్యేశ్వరుడు మహాశక్తివంతుడు. సాక్షాత్తు పరమశివుడిచే శక్తి అనే ఆయుధాన్ని (ఈటె) పొందినవాడు. ఆ కారణంగానే ఆ స్వామిని భక్తితో స్మరిస్తే శక్తియుక్తుల్ని, ఐశ్వర్య ఆరోగ్యాలను ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. కుమారస్వామి, కార్తికేయుడు, స్కంద, మురుగ, షణ్ముఖ, మహాసేన, బాలస్వామి, వేలన్, దండపాణి, వల్లీ నాయక, దేవసేనాపతి, సేనాని, గుహ, గురుగుహ, శివగురు, దేశిక తదితర నామధేయాలతో పిలువబడ్తున్న కుమారస్వామిని ఉత్తర భారతంలో క్రీస్తు శతాబ్ది ప్రారంభంలో ఎక్కువగా పూజించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతుంది. ఆ కాలంలో కుషాణ రాజులు తమ నాణేలపై ఒకవైపున మహాసేనానిని, మరోవైపున స్కందుని ముద్రించారని ప్రతీతి.
స్కంద షష్టి:
మహాశక్తి సంపన్నుడైన కుమారస్వామికి జరిపే పర్వదినాలలో సుబ్రహ్మణ్యషష్టి ఒకటి. స్కంద షష్టిగా కూడా పిలుచుకునే ఈ పర్వదినాన్ని మార్గశిరమాసంలో వచ్చే శుద్ధ షష్టి నాడు నిర్వహిస్తారు. కుమారస్వామి శూరపద్మ అనే రాక్షసుడిని సంహరించి, లోక కళ్యాణం చేసినందుకు గుర్తుగా స్కంద షష్టి లేదా సుబ్రహ్మణ్య షష్టిని నిర్వహిస్తారు. మహిళలు, పిల్లలతో పాటు, ఇంటిల్లిపాదీ అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పర్వదినం నాడు దేశవ్యాప్తంగా కుమారస్వామి వారి ఆలయాలలో అత్యంత ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు కారణ జన్ముడు. నిత్య యవ్వనుడైన ఆ స్వామిని బాలన్, కుమార అని కూడా పిల్వడ జరుగుతోంది. మహామహిమోన్నతుడైన కుమారస్వామి జననం వెనుక పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది.

పురాణగాథ:
ఒకప్పుడు దేవదానవులకు తరచుగా యుద్ధం జరుగుతూ వుండేది. అలాంటి సమయంలో అఖిరసేనుడనే రాక్షసరాజు కూతురు తండ్రిని తృప్తిపరిచే నేపధ్యంలో మాయగా మారి కశ్యప మహర్షిని ఆకర్షిస్తుంది. ఫలితంగా మాయ, కశ్యపులకు శూరపద్మ, సింహముఖ, తారక అనే ముగ్గురు కొడుకులు పుడతారు. వారు పుడుతూనే శివభక్తిలో లీనమయ్యారు.

ఆర్ముగ జననం:
శివుని గురించి ఘోర తపస్సుచేసి, ఆ మహాదేవుని మెప్పించి వరాలు పొంది, ఆ వర గర్వంతో దేవతలను హింసిస్తూ ఉండేవారు. వారు ఇంద్రలోకాన్ని ఆక్రమిస్తారు. ఈ పరిస్థితులకు తట్టుకోలేని దేవతలు శివుని ఆశ్రయించగా, ఆ స్వామి ఆరు ముఖాలతో ఉన్న బాలుని సృష్టించాడు. ఒక్కో ముఖం నుంచి వెలువడిన దివ్య తేజస్సులకు అగ్ని, వాయువులు శరవణ సరోవరంలో వుంచినందున శరవణ భక్తుడయ్యాడు. ఆరుగురు కౄఎత్తికలా జ్యోతి స్వరూపాలను పెంచడంవల్ల కార్తికేయుడ య్యాడు. ఒకే శరీరంలో ఆరుముఖాలు పన్నెండు చేతులు గల కార్తికేయునికి సహాయకులుగా పార్వతిదేవి నూపురం నుంచి తొమ్మిది మంది వీరులు జనించారు. వీరబాహు, వీరకేసరి, వీర మహేంద్ర, వీర మహేశ్వర, వీర పురంధర, వీర రాక్షస, వీర మార్తాండ, వీరాంతక, వీర ధీర అని వారిని పిల్వడం జరుగుతోంది. విష్ణు ఆదేశం మేరకు శివుడు ఆ బాలుని నుంచి ప్రణవోపదేశం పొందాడు. ఆ కారణంగా సుబ్రహ్మణ్యేశ్వరుడికి, శివగురు, స్వామానాథ, దేశిక అనే పేర్లు వచ్చాయి. కుమారస్వామి ఇంద్రుని కుమార్తె అయిన దేవయానిని, శివమూర్తి కుమార్తె వల్లీదేవిని వివాహమాడాడు. అలాగే ఆ స్వామి నెమలిన తన వాహనంగానూ, కోడి పుంజును తన ధ్వజంగానూ చేసుకున్నాడు. ఆ కారణంగా స్వామి శిఖివాహనుడు, కుక్కుట ధ్వజుడయ్యాడు. సుమ్రహ్మణ్వేశ్వరుడి ధ్వజ మందు కోడి పుంజు ఉంటుంది. కో అనే ధ్వని ప్రణవ మును సూచిస్తుంది. జ్ఞాన భానూదయము నకు ధ్వని సంకేతం. అలాగే స్వామి వాహనమైన నెమలి పురివిప్పి నర్తించునపుడు ఓంకార రూపంలో ఉంటుంది. ఆ కార ణంగా స్వామిని ప్రణవ స్వరూపుడిగా చెబుతారు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని సేవించే సమయంలో ఉరగేశ్వ రాయనమః మహోరణాయనమః అని కీర్తించడం జరుగు తోంది. వల్లీదేవి స్వరూపంలో ఉన్నదని, స్వామి కూడా సర్ప రూపంలో ఉంటాడని పురాణాల ద్వారా అవగతమ వుతోంది.

తెలుగు రాష్ట్రాలలో సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఈ పర్వదినం రోజున స్వామికి ఘనంగా పూజలు నిర్వహిస్తారు. సుబ్రహ్మణ్య షష్టిరోజున వేకువజామునే నిద్రలేచి తలంటు స్నానం చేస్తారు. అనంతరం సుబ్రహ్మణ్యేశ్వరునికి సమర్పించడానికి చిలీ (నువ్వులు, బెల్లంతో కలగలిపినది) తయారుచేసి, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పాలు, కోడిగుడ్లతో బయలుదేరుతారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పాకారుడు కావడంవల్ల సమీప ప్రాంతాలలో ఉన్న పుట్టలకు చేరుకుని పుట్టను శుద్ధిచేసి, పసుపు, కుంకుమ బొట్లు, అందమైన ముగ్గులతో అలంకరిస్తారు. అనంతరం, పాలు కోడి గుడ్లను పుట్టలలోవేసి, ప్రసాదాలను, కొబ్బరి కాయలను నివేదిస్తారు. స్వామిని భక్తితో పూజిస్తూ, భజన గీతాలు, భక్తి పాటలతో కీర్తిస్తారు. అనంతరం పుట్ట మన్నును తమ చెవులకు రాసుకుంటారు. అలా చేయడంవల్ల తమకు చెవికి సంబంధించిన వ్యాధులు దరిచేరవని నమ్ముతారు.
అలాగే మహిళా భక్తులు, పుట్టలో పాలుపోసి, పుట్ట చుట్టూ భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేస్తారు. సంతాన ప్రాప్తికోసం స్వామిని మనసావాచా ఆరాధిస్తారు. పిల్లలు, స్వామికి ప్రణామాలు అర్పించి మందుగుండు సామాను కాలుస్తారు. అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే సుబ్రహ్మణ్య ఆరాధన శక్తిని, ఐశ్వర్య మహాద్భాగ్యాలను కల్గిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని అపార కృపా రసామృతం అందరిమీదా వెల్లివిరియాలని మనసావాచా అందరూ పూజిస్తారు.

కుజదోష నివారణకు:
పార్వతీపరమేశ్వరుల మంగళకరమైన ప్రేమకు, అనుగ్రహానికి ఐక్యరూపం సుబ్రహ్మణ్య స్వామి. స్వామి అనే నాయధేయం కేవలం సుబ్రహ్మణ్యానికి సొంతం. దేవసేనాధిపతిగా, సకల దేవగణాల చేత పూజలందుకునే దైవం కుమారస్వామి అని పురాణాలు చెబుతు న్నాయి. అలాంటి షణ్ముఖుని అనుగ్రహం పొందగలిగితే స్కంద పం చమి, కుమార షష్టి రోజున స్వామని పూజించాలి. కుమారస్వామని పూజిస్తే గౌరీశంకరుల కటాక్షం మనకు లభించినట్టేనని పురాణాలు చెబుతున్నాయి. శివపార్వతుల తనయుడైన కుమారస్వామి గంగాదేవి గర్భంలో పెరిగాడు. ఆమె భరించ లేకపోవడంతో, ఆ శిశువు రెల్లుపొదల్లో జారిపడింది. ఆ శిశువును కృత్తికా దేవతలు ఆరుగురు స్తన్యమిచ్చి పెంచారు. జారిపడినందున ఆ శిశువునకు స్కందుడని, రెల్లుగడ్డిలో ఆవిర్బవించడంతో శరవణుడని, కృత్తికా దేవతలు పెంచడంతో కార్తికేయుడని కుమారస్వామి అని పిలుస్తారు. ఇక సుబ్రహ్మణ్యునికి ఉన్న ఆరుముఖాలకు ప్రత్యేక తలు ఉన్నాయి. మయూర వాహనాన్ని అధిరోహించి కేళీ విల ాసాన్ని ప్రదర్శించే ముఖం, పరమేశ్వరునితో జ్ఞానచర్చలు జరిపి ముఖం, శూరుడనే రాక్షసుని వదించిన స్వరూపానికి ఉన్న ముఖం, శరణు కోరిన వారిని సంరక్షించే ముఖం, శూలాయుధ పాణియై వీరుడిగా ప్రస్ఫుటమయ్యే ముఖం, లౌకిక సంపదల్ని అందించే ముఖం ఇలా ఆరు ముఖాల స్వామిగా ఆనందదాయ కుడిగా స్వామి కరుణామయుడిగా భక్తులచే నీరాజనాలు అందు కుంటున్నాడు. అందుచేత ఆషాడ మాస శుక్లపక్ష పంచమి, షష్టి పుణ్యదినాల్లో భక్తులు స్వామిని విశేషంగా సేవిస్తారు. వీటిని స్కందపంచమి, కుమార షష్టి పర్వదినాలు జరుపుకుంటారు. స్కంద పంచమినాడు కౌమారికి వ్రతాన్ని ఆచరించడం ద్వారా అను కున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇంకా పంచమినాడు ఉపవాసం ఉండి, షష్టి నాడు కుమారస్వామిని పూజించడం ఓ సంప్రదాయంగా వస్తుంది. నాగదోషాలకు, సం తానలేమి, జ్ఞానవృద్ధికి, కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధనమే తరుణోపాయం. స్కంద పంచమి, షష్టి రోజుల్లో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు, సుఖవంతమైన జీవితం చేకూరుతుందని పురోహితులు చెబుతున్నారు.

Comments

Popular Posts