• రాయలసీమ అంటే YS రాజశేఖర్ రెడ్డి కాదు..!!, లేక చంద్రబాబు నాయుడు కాదు..లేక YS జగన్ అంతకంటే కాదు..!! అంతకుముందే దానికి ఒక చరిత్ర ఉంది..!! ఎంతో వైభవం ఉంది..!!


·       రాయలసీమ అంటే YS రాజశేఖర్ రెడ్డి కాదు..!!, లేక చంద్రబాబు నాయుడు కాదు..లేక YS జగన్ అంతకంటే కాదు..!! అంతకుముందే దానికి ఒక చరిత్ర ఉంది..!! ఎంతో వైభవం, వైభోగం ఉంది..!! ఫ్యాక్షన్ అనేది కేవలం 1970 నుండి 1995 వరకు మాత్రమే. కానీ నేడు చాలావరకు ఫ్యాక్షన్ పోయింది..అందరికి చదువు విలువ తెలిసింది..!

·       మాడుగుల నాగఫణి శర్మ (జననం 1959 తాడిపత్రి, అనంతపురం)
లక్కోజు సంజీవరాయశర్మ (1907-1997 ప్రొద్దుటూరు, కడప) గణిత బ్రహ్మగా పేరొందిన వీరు ప్రపంచంలో ఆరు వేల గణితా వధానాలు చేసిన ఏకైక వ్యక్తి
అన్నమయ్య (1408-1503 రాజంపేట కడప) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయ కారుడు..!!

·       కుందకుందాచార్యుడు (కొనకొండ్ల - గుంతకల్లు -అనంత పురం
తరిగొండ వెంగమాంబ (1730 -1817 తరిగొండలో చిత్తూరు జిల్లా) 19వ శతాబ్దపు తెలుగు కవయిత్రి.

·       పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి, కంది మల్లయ పల్లి, కడప.!! 17వ శతాబ్దములో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, హేతువాది, సంఘ సంస్కర్త
వేమన (సుమారు 1652-1730 మధ్యకాలం, కడప జిల్లా
మొల్ల (1440 -1530 --గోపవరం-కడప) 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి.
గజ్జెల మల్లారెడ్డి (1925 ఆంకా ళమ్మ గూడూరు కడప) ఈయన ఒక అభ్యుదయ, వ్యంగ్య కవి

·       గువ్వల చెన్నడు (17-18 శతా బ్దాల శతక కవి) కడప జిల్లా రాయచోటి ప్రాంతానికి చెందిన గువ్వల చెన్నడు " గువ్వల చెన్నా" అనే మకుటంతో శతకాన్ని రచించాడు..!!
పుట్టపర్తి నారాయణాచార్యులు (1914-1990 చియ్యేడు-అనంత పురం) తెలుగు పదాల తో ‘‘శివ తాండవం’’ ఆడించిన కవి.

·       తరిమెల నాగిరెడ్డి(1917-1976 తరిమెల గ్రామం-అనంతపురం)

·       B.N రెడ్డి (బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి 1908-1977) జన్మస్థలం కొత్తపల్లి, పులి వెందుల, కడప జిల్లా..!! బి.ఎన్.రెడ్డి తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు, పద్మ భూషణ్ పురస్కార గ్రహీత.
బి.నాగిరెడ్డి (బొమ్మిరెడ్డి నాగిరెడ్డి 1912-2004 విజయ ప్రొడక్షన్స్ ) దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన వ్యక్తి..

·       కె.వి.రెడ్డి (జూలై 1, 1912 - 1972 అనంతపురం జిల్లా తాడిపత్రి) కదిరి వెంకటరెడ్డి తెలుగు సినిమాలకు స్వర్ణ యుగమైన, 1940-1970 మధ్య కాలంలో ఎన్నో ఉత్తమ చిత్రాల ను తెలుగు తెరకు అందించిన ప్రతిభా వంతుడైన దర్శకుడు, నిర్మాత మరియు రచయిత..!!
టీ.జి. కమలాదేవి (1930 - 2012 కార్వేటి నగరం చిత్తూరు) ఈమె తెలుగు సినిమా నటి మరియు స్నూకర్ క్రీడాకారిణి

·       జిక్కి (1938-2004 చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిలో జననం)

·       నీలం సంజీవరెడ్డి (1913-1996, ఇల్లూరు గ్రామం అనంతపురం) భారత రాష్ట్రపతి
దామోదరం సంజీవయ్య (1921–1972 కల్లూరు కర్నూలు) మొదటి దళిత ముఖ్యమంత్రి

·       మునెయ్య (కడప జిల్లా, దొమ్మర నంద్యాల గ్రామం) ఈయన ప్రముఖ జానపద గాయకుడు.
జిడ్డు కృష్ణమూర్తి (1895-1986 మదనపల్లె చిత్తూరు జిల్లా)
బళ్ళారి రాఘవ (1880-1946 తాడిపత్రి అనంతపురం జిల్లా)

·       శంకరంబాడి సుందరాచారి (1914-1977 తిరుపతి చిత్తూరు జిల్లా)
C.R Reddy (1880-1951 కట్టమంచి చిత్తూరు)

·       కట్టమంచి రామలింగారెడ్డి ప్రతిభా వంతుడైన సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత, హేతువాది. ఆదర్శ వాది, రాజ నీతిజ్ఞుడు. ఇంతటి ప్రతిభా పాటవాలు ఒక వ్యక్తిలో కానరావడం అరుదు..!!

·       గడియారం వేంకట శేషశాస్త్రి (1894 పెదముడియం కడప)
పరాయిపాలనను నిరసించి స్వాతంత్య్ర కాంక్షను అణువణువు నా రగుల్చుతూ రచించిన మహా కావ్యమే 'శ్రీశివభారతం'.

·       జానమద్ది హనుమచ్ఛాస్త్రి (1926-2014 రాయదుర్గం అనంతపురం) -తెలుగులో ఒక విశిష్టమైన బహు గ్రంథ రచయిత..!!

·       మధురాంతకం రాజారాం (1930-1999 మొగరాల గ్రామం చిత్తూరు జిల్లా)
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి (జననం 18 శతాబ్దం తొలినాళ్ళ లో-మరణం-1847 జన్మస్థానం రూపనగుడి కర్నూలు జిల్లా)

·       Finally, Rayalaseema means Pemmasani Kamma Empire, greatest Gandikota Pemmasani Kamma kings, Dupaati seema srisailam Karnool ruled Ravella Kamma Kings and Sayapaneni Kamma Kings, Gandikota fort ,116 burjus ,very big fort constructed by Pemmasani Thimma Naidu

·       రాయలసీమ అంటే ఇది..!!

ఇలా ఎందఱో మహాను భావులు మరెందరో చరిత్రలో నిలచిన వారు. అందరూ కలగలిపిన నేల ఈ రాయలసీమ అంటే సీమ అంటే నాలుగు నాటు బాంబులు, 10 మంది ఫాక్షనిస్టు పది సుమోలు కాదు. ఇక్కడ ఆప్యాయతకి అద్భుతమైన ఆతిధ్యానికి మారుపేరు. ఇప్పుడు చెప్పండి రాయలసీమ అంటే ఏంటో ఇప్పుడు చెప్పండి సీమ వైభోగం ఏంటో ఎలా ఉండేదో..తలెత్తి సగర్వంగా చాటి చెప్పండి.

 

Comments

Popular Posts