మన ప్రాచీన శాస్త్రములు: ' తంత్రశాస్త్రము' అంటే ఏమిటి? ఎన్ని విధములు? రహస్యాలేమిటి? తంత్రశాస్త్రాన్ని ఉపాసన చేసిన ప్రముఖులెవరు?

 

తంత్రశాస్త్రము సాధనా గ్రంథము. 'త్రంత్రము'నకు 'ఉపాయము' అని కూడా అర్ధమున్నది. దీని యందు ముఖ్య విషయములను వేదములనుండే తంత్ర శాస్త్రము తీసుకున్నది.ఆ తీసుకున్నదానిని విశదపరిచి వ్రాసింది. తను అనగా విస్తరించుట. తనువిస్తారే. త్ర అనగా తరింప జేయు జ్ఞానము.తరింపజేయు జ్ఞానమును విస్తరించి చెప్పినది తంత్ర శాస్త్రము.తంత్ర శాస్త్రములో శక్తి (స్త్రీ) ఆరాధ్యముఖ్యము.శ్రీసూక్తం మొదలైన వాటిలలో ఉంది. గాయత్రి కూడా స్త్రీయే.యజ్ఞములందు పశుబలులు, సోమపానములున్నవి. తంత్ర శాస్త్రములు దేశాచారములను అనుసరించి అనేక రూపాలుగా ఉన్నాయి. ఈసంప్రదాయములు కల ప్రాంతములను క్రాంతములందురు.వింధ్యకు ఉత్తరాన ఉన్న భూమిని రాధాక్రాంతమంటారు.ఇక్కడ కాశ్మీరి సంప్రదాయం ఉంది.తూర్పున ఉన్న ప్రాంతమును విష్ణు క్రాంతము అంటారు.ఇక్కడ గౌడ (వంగ) సంప్రదాయం ఉంది. దక్షిణ దేశమును అశ్వ క్రాంతమందురు. ఇక్కడ కేరళ సంప్రదాయం ఉంది.ఎవరి ఆచారవ్యవహారములను అనుసరించి ఆసాధనలు ప్రబలినవి.వంగీయులు మత్స్య మాంస ప్రియులు-వీరు వాటిని విశేషముగా ఉపయోగించిరి.

తంత్రశాస్త్రము: విధానములు-సాధనలు-భావనలు:
తంత్ర పూజలు 5 విధానములు.ఇవి ఒక్కొక్క శక్తికి 5 రూపాలు.
సూర్య
గణపతి
విష్ణు
శివ
శక్తి
సాధనలు:
సాధకుని భావము-చతురతననుసరించి 4 విధానములు.
పూజ
జపం
ధ్యానము
బ్రహ్మత్వం.
సాధకుని భావనము లు మూడు.
పశుభావం- లజ్జా మోహకామక్రోధాదులనే పాశములతో కట్టుబడి ఉన్నాయి. పశ్వాచారులు.
వీరభావం- పశుబంధమును తెంచుకొని, జితేంద్రియుడైనవానిని వీరాచార్యులంటారు.
దివ్యభావం- బ్రహ్మజ్ఞాన సంపన్నుడైన వానిని దివ్యాచార్యుడంటారు.

కులార్ణవ తంత్రము 7 రకాల ఆచారములను చెప్పింది.
(1)వేదాచారం-ఇది ఆచారములకు స్థూల దేహం వంటిది.బహిఃపూజలు చేయువిధానమిది.ఇది క్రియా మార్గము.
(2)వైష్ణవాచారము - ఇది భక్తి యోగము, హృదయ సాధన.
(3) శావాచారము - జపయోగము.
(4)దక్షిణాచారము-వీరు దక్షిణకాళికను పూజింతురు.వీరు గాయత్రిని ఉపాసింతురు.
(5)వామాచారము-గురువు వల్ల తంత్ర దీక్ష పొదాక దక్షిణాచార్యులు వామనాచార్యులగుదురు.వీరు వామనుని పూజింతురు.స్త్రీ వామపార్స్వంలో ఉండు.
(6)సిద్ధాంతాచారము-లజ్జాభయమోహములు వీరికి ఉండవు.వీరు శ్మశానంలో ఉందురు.యోగరహస్యములు తెలుసుకుంటు ఉందురు.అష్టాంగయోగమును సాధించి తురీయాచారమైన కాలాచారమునకు అర్హత పొందుతారు.
(7)కాలాచారము- ఇది భాక్మీభావం.ఇతనికి శాత్రువులు, మిత్రులు, లాభనష్టాలు అనేభావాలు ఉండవు. అన్నీ సమానమే.ఏకాంతంగా శ్మశానభూములందు ఉంటు నిర్వికల్పసమాధిస్థితిలో ఉందురు. ఇదే చివరి దశ.

యంత్ర, మంత్ర రహస్యాలు:
· తంత్ర సిద్ధికి సాధనలు మంత్రయంత్ర పూజలు (బహిర్ముఖమైనవి), హఠ, రాజయోగములు(అంతఃముఖమైనవి).మంత్రయంత్రములు శక్తిసమంతములైనవి.మంత్రము శబ్దబ్రహ్మమునుండి పుట్టింది.కనుక మంత్రము బ్రహ్మ శక్తి. దీనివల్ల అంతఃసాధనయైన కుండలినీశక్తి కలుగుతుంది.
· మత్రము శబ్ద శక్తి. యంత్రము చిత్ర శక్తి. యంత్రము శరీరము. మత్రము ప్రాణము.యంత్రమందు మంత్రం చేర్చినప్పుడు జీవం కలదౌను.కామక్రోధాధులను నియంత్రణ చేయునది యంత్రము.మనన చేత తరింప జేయునది మంత్రము.యంత్ర మంత్రములు రెండును రహస్యముగా ఉంచదగినవే.యంత్రము సాంకేతిక శక్తి.శివునికి గాని, శక్తికిగాని త్రికోణము యాంత్రిక సంకేతము, 3 గీతలు ఒక్క ఆకారంగాచేసిన త్రికోణము.ఒక్క రూపంలో 3 వస్తువులున్నవి.ఒకడే 3 ఆకారములుగా ఉంది.అందుకే త్రికోణము ఆదిశక్తికి గాని, ఆది శంభునికి గాని సంకేతమైన యంత్రము.
·    శక్తి సమస్త ప్రపంచమునకు ఉత్పత్తి చేయుయోని.రెండు త్రికోణాకారాములను శివశక్తుల సంయోగముగా పరిగణింతురు.ప్రపంచ శబ్దములో, ప్ర అనగా వికసించుట పంచ అనగా 5 భూతములు.దీని అర్ధం పంచభూతముల వికాసమే ప్రపంచము.బీజమైన బిందువునకు శివశక్తుల సంయోగము ప్రధానకారణము.
·  ఆది శివుని సంకేతమైన త్రికోణాకారము మీద శాక్తి సంకేతమైన త్రికోణాకారమును తలక్రిందులుగా ఉంచెదరు.ఇప్పుడు శక్తిసంకేతమైన రెండు త్రికోణాకారములు యోని అంటారు.ఇదే సృష్టి క్రీడ. తంత్ర శాస్త్రము దీనిని సదాశివ అంటుంది.మంత్ర శాస్త్రము రంభం అంటుంది.
·    తంత్ర శాస్త్రము ప్రకారము బ్రహ్మకు రెండు కళలు. (1) సా కళ (2) నిష్కళ. బ్రహ్మ మూల ప్రకృతిలో కలిసినప్పుడు సాకళ అప్పుడు ప్రకృతి గర్భమందు బీజోత్పత్తియౌను, అప్పుడు ఒక స్పందనం ఏర్పడును.ఈ స్పందనమే నాదం.నాదం నుండి బిందువు ఏర్పడును.నాదమునకు సంకేతము వంటి బాలచంద్రాకారము.కలవక ఉన్నప్పుడు నిష్కళ.
·       ఆదియందు పరమేశ్వరుడు ఒక్కొక్క కామ్యమునకు ఒక్కొక్క తంత్ర శాస్త్రం చొప్పున 64 తంత్ర శాస్త్రములను చెప్పాడు.కామ్యములన్నింటిని పొందుటకు 64 తంత్రములను పూజించవలసివచ్చింది.ఇది కష్టమైన కార్యము.కనుక పరమేశ్వరుని సులభమార్గం చూపించమని ప్రార్థించారు.దీని పర్యవసానంగా పరమేశ్వరుడు శ్రీవిద్యోపాసనను ప్రసాదించాడు. శ్రీవిద్యోపాసనలో 12 సంప్రదాయములున్నవి.

కొందరు తంత్ర శాస్త్ర ఉపాసకులు:
మహాకవి కాళిదాసు
జగద్గురువు ఆది శంకరాచార్యులు
శివాజీ మహారాజు.
రామకృష్ణ పరమహంస
అరబిందో
శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి


Comments

Popular Posts