గణపతి శ్లోకం - అర్ధము

శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోప శాంతయే
తెల్లని వస్త్రాలు ధరించినవాడూ, అంతటా వ్యాపించియున్నవాడూ, చంద్రునిలా తెల్లనైన శరీరవర్ణం గలవాడూ, నాలుగు చేతులు గలవాడూ, అనుగ్రహదృష్టితోడి ముఖంగలవాడూ అయిన వినాయకుని అన్ని అడ్డంకులు నివారించుటకై ధ్యానిస్తున్నాను.

అగజానన పద్మార్కం గజాననమ్‌ అహర్నిశం
అనేకదంతమ్‌ భక్తానాం ఏకదంతమ్‌ ఉపాస్మహే
(అగజ) పార్వతి ముఖపద్మమును వెలిగించువాడు, ఏనుగు ముఖము గలవాడు, అన్నివేళలా ఎన్నోవిధములైసంపదలను తన భక్తులకు ఇచ్చువాడు అయిన ఏకదంతుని స్మరిస్తున్నాను.


~ఓం గం గణపతయే నమః ~

Comments

Popular Posts