వినాయకుడి రూపము ప్రణవమంత్రమైన ఓంకారమును పోలి ఉంటుంది: దానికి సంభందించిన వివరణ


సృష్టిలో తొలి శబ్దం ఓంకారం. ప్రణవ మంత్రం అయిన ఓంకారము స్వరూపమే తొలి పూజలు అందుకునే వినాయకుడని అంటారు. వినాయకుడి రూపము ఓంకారంలా ఉంటుందని చెబుతుంటారు. ఈ భావమునకు సంబంధించిన వివరణ ఇలా చెబుతారు:

సంస్కృత భాషలో ఓంఅనే అక్షరం 3 అంకెలా వుండి దాని మధ్యనుంచి ఒంకరగా ఒక తోక వచ్చి, దానిపైన అర్థచంద్రరేఖ వుండి, అందులో ఒక బిందువు వుంటుంది. ఓంకారానికి ఆకారం అది. ఓంకారం అంటే ప్రణవం’. వినాయకుడు ప్రణవస్వరూపుడు. 3 అంకెలో వుండే పైభాగం ఆయన తల. క్రింద భాగం కాస్త పెద్దదిగా వుంటుంది. అది ఆయన బొజ్జ. మధ్యనుంచి వుండే తోక, ఆయన తొండం. దాని పైనున్న అర్థచంద్రరేఖ చవితి చంద్రుడు. వినాయకుడు పుట్టింది భాద్రపద శుద్ధచవితి. దాని మధ్యలోనున్న బిందువు హస్తనక్షత్రం. చంద్రుడు హస్త నక్షత్రంతో కలిసి ఉండే మాసం భాద్రపదమాసం’.

~ఓం గం గణపతయే నమః 

Comments

Popular Posts