శనీశ్వరుడు ప్రసన్నుడవ్వాలంటే ఏమి చేయాలి?


~ శనీశ్వరుడు ప్రసన్నుడవ్వాలంటే ఏమి చేయాలి? ~
‘కంటక శని’  (అనగా చాంద్రయానాన్ని అనుసరించి జన్మరాశి నుండి ఎనిమిదవ ఇంటిలోనికి శని ప్రవేశించినప్పుడు) దోషం ఉన్నవారు లేదా, ‘ఏలినాటి శని’ (అనగా చాంద్రయనాన్ని అనుసరించి జన్మరాశి నుండి పన్నెండు, మొదటి మరియు రెండవ ఇంటిలోనికి శని యొక్క గమన సమయంలో) దోషం ఉన్నవారు.....
·       అమావాస్య రోజున కాళీమాత పూజ చేయాలి.
·     విష్ణువును, కృష్ణుని రూపంలో ధ్యాన్నిస్తూ 'ఓం నమో నారాయణాయ', 'హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే..'అని జపించాలి.
· హనుమంతుడిని సర్వోత్కృష్టమైన (అనంతమైన) రూపంలో ధ్యానించాలి. శని, హనుమంతుని వీపుపై, చేరి అతన్ని పట్టి పీడించాలని ప్రయత్నించినప్పుడు, తన బలం అంతా ఉపయోగించి, ఒక్క విదిలింపుతో శనిని, విసిరి పారేసినప్పుడు సూర్య భగవానుడు, హనుమంతుడిని మెచ్చుకుని, "నిన్ను పూజించిన వారికి శని బాధలుండవు" అని దీవించాడట.
·  శనిత్రయోదశి, శనిజయంతి (పుష్యమాసం, బహుళఅష్ఠమి) మరియు శనిఅమావాస్య రోజులలో తిలాభిషేకం చేయాలి.
·       బ్రాహ్మణునికి నల్ల నువ్వులు దానం చేయాలి.
·       నల్ల ఆవు (కపిల గోవు) కు బెల్లం మరియు నువ్వుల మిశ్రమాన్ని తినిపించాలి.
·       శనివారాలలో (శ్రావణ మాసంలో తప్పనిసరిగా) ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉపవాసం ఉందాలి.
·       కాకులకు ఉదయం, మధ్యాహ్న వేళలలో అన్నం పెట్టాలి.
·       వికలాంగులైన వారికి ఆహారం అందివ్వాలి.
·       నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి.
·       శని క్షేత్రాలు సందర్శించాలి. 
·      ప్రతిరోజూ సూర్యాస్తమయం తరువాత ఇంటి ముఖద్వారం వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.
·       దశరథ మహారాజ కృత శని స్తోత్రమును పఠించాలి.
·       శ్రావణ పూర్ణిమ నాడు, జ్యేష్టాదేవికి, శనీశ్వరుడికి కళ్యాణం జరిపించాలి.
·  మూలమంత్రం, పునర్చరణ, హవనం, దానములతో పాటుగా 19000 సార్లు శనిజపం చేయటం మంచిది.
·       శ్రావణమాసలో, శనివారాలలో శనైశ్వరవ్రతం, హోమం చేయటం చాలా మంచిది.
·       శ్రావణ శుద్ధ విదియ నుండి శ్రావణ బహుళ షష్ఠి వరకు శనైశ్వర దీక్ష ఆచరించాలి.
·       'రామనామం', ‘హనుమాన్ చాలీసా’, ‘దుర్గాస్తుతులను’ జపించాలి.
·       హనుమంతుడు, శ్రీ దుర్గా దేవి, వినాయకులను ప్రార్థించటం ఎంతో మంచిది.
·       పెరుగన్నం, దేవునికి నైవేద్యంగా పెట్టిన ఆతరువాత కాకులకు పెట్టాలి.
·       అనాథ బాలలకు అన్నదానం చేయాలి.
పై వాటిలో ఏది పాటించినా ఆ శనిదేవుని అనుగ్రహానికి పాత్రులయి గ్రహ పీడ దోషాలనుంచి ఉపశమనం పొందవచ్చు. 
శనీశ్వరుడి జప మంత్రాలు:
నీలాంజన సమాభాసం
రవి పుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం
తమ్ నమామి శనైశ్చరం

|| ఓం శం శనయేనమ:||

|| ఓం నీలాంబరాయ విద్మహే సూర్య పుత్రాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్ ||
|| ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్వరాయ నమః ||

Comments

Popular Posts