గురువారం రోజు హనుమంతునికి మల్లెపువ్వులతో చేసిన మాల సమర్పించడం ద్వారా వ్యాపారాభివృద్ధి, మనోధైర్యం, సంతానప్రాప్తి చేకూరుతుంది.



 

అశోక వనంలో ఉన్న సీతమ్మ వద్దకు రాములవారు హనుమంతుడు ద్వారా సందేశము పంపినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారని పురాణాలు చెప్తున్నాయి. అశోకవనంలో సీతమ్మ తల్లికి ఎలాంటి పువ్వులు కనిపించకపోవడం వల్ల   .. తమలపాకులతో మాల చేసి వేశారు. అందుకే హనుమంతునికి తమలపాకులచేసిన మాల అంటే చాలా  ప్రీతి అని పురాణాలు చెప్తున్నాయి. తమలపాకుల దండను సమర్పించిన వారికి కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు సూచిస్తున్నారు. 

ఇంకా ఆంజనేయ స్వామికి పరిమళంతో కూడిన పువ్వులను సమర్పించడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయి. అందుకే హనుమంతునికి గురువారం మల్లెపువ్వులతో పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయి. గురువారం పూట శుచిగా భక్తిశ్రద్దలతో రామభక్తుడైన హనుమంతునికి మల్లెపువ్వులతో మాల సమర్పించడం ద్వారా వ్యాపారాభివృద్ధి, మనోధైర్యం, సంతానప్రాప్తి చేకూరుతుంది. అలాగే ఎరుపు రంగు పువ్వులు, తులసి, సింధూరంతో స్వామివారికి అర్చించాలని పండితులు చెప్తున్నారు. 

శనిదోషాలు తొలగిపోవాలంటే.. శనివారం లేదా గురువారం పూట హనుమంతునికి వెన్నతో అభిషేకం చేయించాలి. అలాగే ఎరుపు రంగు పువ్వులు, తులసి, సింధూరంతో స్వామివారికి అర్చించాలని పండితులు చెప్తున్నారు. ఇంకా ఆంజనేయ స్వామికి పాలు, పెరుగులతో కూడా అభిషేకం చేయించవచ్చు. మంచి రోజు చూసుకుని హనుమంతునికి అభిషేకం చేయించడం ద్వారా అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.

Comments

Popular Posts