హనుమంతుని భక్తి శ్రధ్ధలతో పూజిస్తే శనీశ్వరుని ప్రభావం ఉండదని చెబుతుంటారు. ఎందుకు?


 
హనుమంతుని పూజించుట వలన శని భగవానుడి యొక్క ఉనికిచే ఏర్పడే 'ప్రతికూల' ప్రభావాల నుండి ఉపశమనాన్ని పొందవచ్చని విశ్వసిస్తారు. దీనికి సంబంధించి రెండు పురాణ గాథలు ప్రాచుర్యం లో ఉన్నాయి  

ఒకసారి రావణుడు శనిదేవుని లంకలో బంధించి ఉంచుతాడు. అదేసమయంలో  సీతమ్మ జాడ తెలుసుకునేందుకు హనుమంతుడు రావణ అంతఃపురంలోని ఒక్కొక్కగది తెరుస్తాడు. ఈ క్రమంలోనే శనిదేవున్ని బంధించిన గది తాళం కూడా  తీస్తాడు. దీంతో శనిదేవునికి రావణుడి నుంచి విముక్తి పొందినట్టు పురాణగాథలు పేర్కొంటున్నాయి. రావణుడి బారి నుండి తనను రక్షించినందుకు కృతజ్ఞతగా, ఎవరైతే హనుమంతుని, ముఖ్యంగా శనివారాలలో, పూజ చేసి ప్రార్థిస్తారో, వారు శనిగ్రహం యొక్క "దుష్ప్రభావాల" నుండి విముక్తులగుదురు, లేదా కనీసం వాటి ప్రభావము తగ్గుతుందని శనిభగవానుడు  హనుమంతునికి ప్రమాణం చేశాడు.అందుకనే అంజనీపుత్రున్ని సేవిస్తే శనీశ్వరుని నీడ మనపై పడదు. అందుకనే భవిష్యత్‌ కల్పంలో ఆయన బ్రహ్మగా బాధ్యతలు నిర్వహించనున్నారు. అందుకనే స్వామివారిని భవిష్యత్‌ బ్రహ్మగా కొలుస్తాం. 

శని భగవానుడు మరియు హనుమంతుడి మధ్య జరిగిన ఇంకొక సంఘర్షణను గూర్చిన కథనం ప్రకారం శని ప్రభావము హనుమంతుడిపై మొదలవుతున్న సూచికగా, ఒకసారి శనీశ్వరుడు హనుమంతుడి భుజాలపై ఎక్కాడు. అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని భారీగా పెంచి, శనిదేవునిని, తన భుజాలు, పైకప్పు మధ్య పెట్టి బంధించి, నొక్కడం మొదెలెట్టాడట. నొప్పిని భరించలేక శననీశ్వరుడు, తనను విడిచిపెట్టమని పరివిధాల వేడుకుంటూ, హనుమంతుడిని ప్రార్థించాడట. ‘తనను విడిచి పెట్టినట్టయితే, ఎవరు హనుమంతుడిని ప్రార్థిస్తారో, వారిపై తన (శని) యొక్క దుష్ప్రభావాలు లేకుండ చేసెదనని’ శనీశ్వరుడు, హనుమంతుడికి మాట ఇచ్చిన తరువాత శనిదేవుని విడిచిపెట్టాడట.
 
 

Comments

Popular Posts